పవన్ ముందుంటేనే ఏపి కి ప్రత్యేక హోదా..?

Wednesday, May 11th, 2016, 08:23:24 AM IST


జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ నుంచి ప్రస్తుతం దూరంగా ఉంటున్నారు. తెలుగుదేశం పార్టీకి బీజీపీకి వారధిగా నిలిచిన పవన్ ఇప్పుడు సడెన్ గా ఆ రెండు పార్టీలకు దూరంగా ఉండటంతో.. తెలుగుదేశం పార్టీ, బీజేపిలు అయోమయంలో పడ్డాయి. పవన్ అండతో పుంజుకోవాలి అనుకుంటున్న బీజేపికి భంగపాటు ఎదురైంది. ఇక, వచ్చే ఎన్నికలలో కూడా పవన్ ఉంటె తప్పకుండా విజయం సాధించవచ్చు అనుకున్న తెలుగుదేశం పార్టీకి కూడా కాస్త ఇబ్బందులు తప్పేటట్టు కనిపించడం లేదు.

పవన్ కళ్యాణ్ ఈ రెండు పార్టీలకు దూరంగా ఉండటమే కాకుండా, వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తా అంటున్నాడు. అందుకు కారణం లేకపోలేదు. కేంద్రం ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి, తరువాత సైలెంట్ గా ఉన్నది. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇబ్బందులలో పడ్డారు. ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రం చెప్తున్నది. అయితే, ప్రత్యేకం కోసం పవన్ కళ్యాణ్ కనుక ముందుండి పోరాటం చేస్తే ప్రత్యేక హోదా తప్పకుండా వస్తుందని కొంతమంది నేతలు చెప్తున్నారు. ప్రత్యేక హోదా కోసం ఇప్పటికే అటు ప్రతిపక్షాలు, ఇటు ప్రత్యేక సాధన సమితి కూడా పోరాటం చేస్తున్నది. వీరితో చేతులో కలిపితే ప్రత్యేక హోదా సాధ్యం అవుతుందని అంటున్నారు.