రివ్యూ ‘రాజా’ తీన్ మార్ : స్పీడున్నోడు – ఈడు స్పీడ్ కాదు స్లోనే.!

Friday, February 5th, 2016, 05:11:14 PM IST

తెరపై కనిపించిన వారు : బెల్లంకొండ శ్రీనివాస్, సొనారిక బడోరియా…

కెప్టెన్ ఆఫ్ ‘స్పీడున్నోడు’ : భీమనేని శ్రీనివాసరావు

మూల కథ :

ఫ్రెండ్స్ కోసం ఏమన్నా చేయడానికి సిద్ధమయ్యే వాడే మన హీరో శోభన్(బెల్లంకొండ శ్రీనివాస్). అలాంటి వాడు తన ఫ్రెండ్ గిరి(మధు) ప్రేమని సెట్ చేయడం కోసం రంగంలోకి దిగుతాడు. గిరి ప్రేమించే అమ్మాయే వాసంతి(సొనారిక బడోరియా). గిరి ప్రేమకి సహకరించే ప్రయత్నంలో ఉండగా వాసంతి వచ్చి శోభన్ కి ప్రపోజ్ చేస్తుంది. ఫైనల్ గా గిరి కాంప్రమైజ్ అయ్యి శోభన్ – వాసంతిలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. అక్కడి నుంచి శోభన్ లైఫ్ లోకి లేనిపోనీ సమస్యలు వస్తూనే ఉంటాయి. ఆ సమస్య లేంటి? ఎవరు క్రియేట్ చేసారు? వాటిని ఎలా సాల్వ్ చేసి, కథని సుఖాంతం చేసాడు అన్నదే కథ.

‘విజిల్ పోడు’ :

1. తమిళ హిట్ మూవీకి ఇది రీమేక్, అలాగే రీమేక్ స్పెషలిస్ట్ అయిన భీమనేని శ్రీనివాసరావు డైరెక్టర్ కావడం, అలాగే మొదటి సినిమా అల్లుడు శీను తో హిట్ అందుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ హీరో అవ్వడం.. ఇలాంటి కాంబినేషన్ లో రావడం ఈ సినిమాకి బాక్స్ ఆఫీసు వద్ద పెద్ద ప్లస్.

2. ఒరిజినల్ వెర్షన్ నుంచి తీసుకున్న ఒరిజిన స్టొరీ లైన్ బాగుంది. మనకు మనంగా క్రియేట్ చేసుకునే స్నేహ బంధం బ్యాక్ డ్రాప్ కి ఒక ప్రేమకథని మిక్స్ చేసి చెప్పిన విధానం చాలా బాగుంటుంది.

3. 20 నిమిషాల పాటు సాగే క్లైమాక్స్ ఎపిసోడ్ చూసాక విజిల్ కొట్టాల్సిందే.. ఈ సీన్ స్టార్ట్ కావడానికి ముందు మిల్క్ బ్యూటీ తమన్నా చేసిన స్పెషల్ సాంగ్ సినిమాకి ఒక ఊపును తెస్తుంది. అక్కడక్కడా కొన్నికామెడీ బిట్స్ కూడా బాగానే ఉన్నాయి.

‘ఢమ్మాల్ – డుమ్మీల్’ :

1. ఒరిజినల్ సినిమా చేయడం కంటే రీమేక్ చేయడం చాలా కష్టం.. ఎందుకంటే ఒక నేటివిటీకి సెట్ అయ్యే కథని తీసుకొని దాన్ని మన నేటివిటీకి సింక్ అయ్యేలా సెట్ చేసుకొని దానికన్నా బెటర్ గా వచ్చేలా తీయాలి. అది కష్టం.. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒరిజినల్ వెర్షన్ కి నేటివిటీ అనేదే పెద్ద హెల్ప్ కానీ దీనికి అదే మైనస్.

2. అలాగే కమర్షియల్.. కమర్షియల్ అనే ధోరణిలో సినిమాలో చాలా మార్పులు చేర్పులు చేసారు.. దానివలన సినిమాకి కీలకం అయిన మెయిన్ సోల్ మిస్ అయ్యింది. అలాగే సినిమా పొడవు పెరిగి పోయి బాగా బోరింగ్ గా తయారైంది.

3. కమర్షియాలిటీ అని సినిమాలో పెట్టుకున్న ఎక్స్ట్రా పాటలు, ఎక్స్ట్రా సీన్స్ ఏవీ వర్కౌట్ అవ్వలేదు. ఇంకో మైనస్.. ఒరిజినల్ వెర్షన్ లో హీరోకి ఈక్వల్ గా ఫ్రెండ్ పాత్ర హీరోయిన్ పాత్ర ఉంటుంది. కానీ తెలుగులో హీరోకి ఎక్కువ హైప్ ఇచ్చి హీరోయిన్ మరియు ఫ్రెండ్ రోల్ చేసిన శ్రీనివాస్ రెడ్డి పాత్రకి ప్రాధాన్యత తగ్గించారు. దాని వలన కామెడీ కూడా తగ్గిపోయింది.

దావుడా – ఈ సిత్రాలు చూసారా.!!

–> సినిమా మొదట్లో ప్రేమికులను వారి ఊరిలో నిర్దాక్షన్యంగా చంపేస్తారు అని చెప్తారు. కానీ ప్రేమ పావురం బస్సులో మాత్రం కోకొల్లలుగా లవ్ స్టోరీస్ జరుగుతుంటాయి. అలాగే హీరో లవ్ స్టొరీ కూడా జరుగుతుంది. వీటన్నిటికీ మాత్రం ఆ లాజిక్ ఎందుకు వర్తించదో..

–> హీరోకి అంతా తన ఫ్రెండ్స్ వల్లే జరుగుతోంది అని తెలిసినా దానికి పరిష్కారం ఆలోచించే ప్రయత్నం చేయకుండా, వాళ్ళు ఏం ప్రాబ్లమ్ క్రియేట్ చేసినా భారిస్తూ ఉంటాడు. ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఇచ్చాడు బాగానే ఉంది, అలా అని ఇద్దరి మధ్యలో ఉన్న మనస్పర్దలని తొలగించకపోతే ఎలా అంటున్నా..

–> సినిమా చూసాక.. ఇద్దరు ఇలా మాట్లాడుకుంటున్నారు…
మిస్టర్ ఎ : బెల్లంకొండ శ్రీనివాస్ బాగా చేసాడు,డాన్సులు అయితే చించేసాడు..
మిస్టర్ బి : నువ్వన్నది బాగుంది నేననేది ఇంకా బాగుంటుంది.. చూడు బావా హీరో ఒక్కడు బాగా చేస్తే సినిమా హిట్ అవ్వదు, సినిమా మొత్తం బాగుంటేనే ఆడుద్ది.. బాబు బాగానే చేసినా సినిమా చాలా బోరింగ్ గా ఉందిగా..
మిస్టర్ ఎ : అవును బావో… మధ్య మధ్యలో చాలా బోర్ కొట్టేసింది. రెండున్నర గంటలు ఎందుకు చెప్పు..
మిస్టర్ బి : మరదే చెప్పేది.. బాబు బాగా చేసినా సినిమా మాత్రం యావరేజ్ బొమ్మ.. టైటిల్ కూడా ఇది కాకుండా వేరే ఏదన్నా అయ్యుంటే బాగుండేది..
మిస్టర్ ఎ : నిజమే నిజమే.. సినిమా కథకి టైటిల్ పెద్దగా సెట్ కాలేదు.