ఇక విమానప్రయాణం మరింత చౌక..!

Wednesday, February 11th, 2015, 01:41:31 PM IST


ఒకప్పుడు దేశంలో విమాన ప్రయాణం అంటే… అది కేవలం సంపన్న వర్గాలకు లేదంటే… బిజినెస్ పర్సన్స్ కు మాత్రమే అందుబాటులో ఉండేది. అయితే, నేడు అంతర్జాతీయ విపణిలో పోటీపెరగటం.. దీనికి తోడు ఇంధన ధరలు కూడా తగ్గటంతో వివిధ విమానయాన సంస్థలు భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. విమానంలో ప్రయాణం చేయాలని అనుకునేవారు.. ఆ కోరికను తీర్చుకోవడానికి ఇదొక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. రైలు, బస్సు చార్జీలకంటే తక్కువ చార్జీలతో విమాన ప్రయాణం చేయవచ్చని అంటున్నది స్పైస్ జెట్. ఇప్పటికే… ఇండిగో, జెట్ ఎయిర్ వేస్ సంస్థలు ఆఫర్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే, ఇప్పుడు స్పైస్ జెట్ ప్రకటించిన ఆఫర్… మిగతా వాటితో పోల్చుకుంటే మరింతతక్కువగా ఉన్నది. కేవలం 599 రూపాయలకే విమాన ప్రయాణం చేయవచ్చు. అయితే, ఈ ఆఫర్ టిక్కెట్లను ఈనెల 11 మరియు 13వ తేదీలలోనే విక్రయిస్తారు. టిక్కెట్ పొందిన వారు జులై 1నుంచి అక్టోబర్ 24 తేదీల మధ్య ప్రయాణం చేయవచ్చు. గతంలో స్పైస్ జెట్ ఆఫర్ ధరకే టిక్కెట్ విమాన టిక్కెట్ అమ్మకాలకు మంచి రెస్పాన్స్ రావడంతో.. నేడు ఈనిర్ణయం తీసుకున్నట్టు స్పైస్ జెట్ ప్రకటించింది. ఇంకెందుకు మరి ఆలస్యం.. వెంటనే టికెట్ బుక్ చేసుకుందాం..