షాకింగ్: సంచలనానికి తెర లేపుతున్న శ్రీనివాసరావు మాటల వీడియో..!

Wednesday, October 31st, 2018, 02:53:52 AM IST

వై ఎస్ జగన్ పై మొన్న హత్యా ప్రయత్నానికి పాల్పడిన యువకుడు శ్రీనివాసరావు పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మారు మోగిపోతుంది.ఇప్పటికే జగన్ పై అతను చేసిన దాడి పట్ల సిట్ అధికారులు గత రెండు రోజులు నుంచి కూలంకషంగా విచారిస్తున్నారు,అయితే ఇప్పుడు తాజాగా శ్రీనివాసరావు మాట్లాడుతున్న వీడియో ఒకటి పెను సంచలనానికి దారి తియ్యనుందా అన్న సందేహం కలిగిస్తుంది.ఆ వీడియోలో గమనించినట్లయితే శ్రీనివాసరావు చాలా ధీన పరిస్థితిలో ఉన్నట్టు తెలుస్తుంది.

అతన్ని పోలీసులు విచారణ అనంతరం పోలీసు జీపు లోకి ఎక్కించగా మాట్లాడుతున్న మాటలు గమనించగా తనకి ప్రజలతో మాట్లాడే ఒక్క అవకాశం ఇవ్వమని అతను పదే పదే వేడుకుంటున్నాడు,అంతే కాకుండా అతన్ని అక్కడి నుంచి లోపలికి తరలిస్తుండగా తనకి ప్రాణహాని ఉందని కూడా చెప్తున్న మాటలు కూడా రికార్డు అయ్యాయి,అయితే విచారణలో ఏం జరిగిందో,తాను ప్రజలతో ఎందుకు మాట్లాడాలనుకుంటున్నాడో ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం కావాలంటే ప్రజా సమక్షంలో అతన్ని మీడియా ముఖంగా ప్రశ్నిస్తే తెలిసుస్తుంది.