రాజీవ్ గాంధీ హత్య కేసులో కొత్త మలుపు

Friday, April 27th, 2018, 11:38:35 AM IST

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జైలు జీవితం అనుభవిస్తున్న ఎస్.నళిని శ్రీహరన్ పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు కొట్టిపారేసింది. ముందస్తుగా రిలీజ్ చేయాలని ఆమె కోర్టుకు అభ్యర్థన పెట్టుకున్నది. దాన్ని ఆ రాష్ట్ర కోర్టు ఇవాళ తీర్పునిచ్చింది. ప్రస్తుతం ఆమె జీవితకాల శిక్షను అనుభవిస్తున్నది. జ‌స్టిస్ కేకే స‌దాశివ‌న్‌, జ‌స్టిస్ ఆర్‌. సుబ్ర‌మ‌ణియ‌న్ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం న‌ళిని పిటిష‌న్‌ను కొట్టివేసింది. ఈ అంశంపై ఇప్ప‌టికే సుప్రీంకోర్టు స్ప‌ష్ట‌మైన తీర్పునిచ్చింద‌ని, అలాంటి అంశంలో తాము జోక్యం చేసుకోబోమ‌న్నారు. వెల్లోర్ సెంట్ర‌ల్ జైలులో న‌ళిని శిక్ష‌ను అనుభ‌విస్తున్న‌ది. ఆర్టిక‌ల్ 161 ప్ర‌కారం 20 ఏళ్లు శిక్ష పూర్తి చేసుకున్న వారిని విడుద‌ల చేయ‌వ‌చ్చు అంటూ 1994లో ప్ర‌భుత్వం ఓ స్కీమ్‌ను తీసుకువ‌చ్చింది. దాని ప్ర‌కారం రిలీజ్ చేయాలంటూ పిటిష‌న‌ర్ వేడుకున్నారు.