2014 సంవత్సరానికి బైబై చెప్పి 2015 సంవత్సరానికి గ్రాండ్ వెల్ కమ్ చెప్పడానికి హైదరాబాద్ నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబు అవుతోంది. కాగా దీనికోసం భాగ్యనగరంలోని ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థలన్నీ అప్పుడే ప్రముఖ సెలబ్రిటీలను నగరానికి రప్పిస్తూ ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. అయితే ఈసారి ప్రధమంగా ప్రముఖ బాలీవుడ్ కథానాయిక సన్నీలియోన్ నగరంలో సందడి చెయ్యనున్నారు. ఇక జూబ్లిహిల్స్ లో ఉన్న జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో డిసెంబర్ 31న జరిగే పార్టీలో సన్నీలియోన్ పాల్గొని 2015 సంవత్సరానికి ఆహ్వానం పలకనున్నారు.
కాగా ఆర్ఎన్ హెచ్ ఈవెంట్ సంస్థ నిర్వహిస్తున్న ఈ పార్టీలో సన్నీలియోన్ కనువిందు చెయ్యనుండడంతో మిగిలిన ఈవెంట్ సంస్థలు కూడా పెద్ద పెద్ద బాలీవుడ్ స్టార్స్ ని నగరానికి రప్పించడానికి పోటీ పడుతున్నాయి. మరి ఒకరితో ఒకరు పోటీలు పడి మరీ ఈ సంస్థలు సెలబ్రిటీలను రప్పిస్తుండడంతో డిసెంబర్ 31 రాత్రి స్టార్స్ తో కళకళలాడబోతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.