సూపర్ స్టార్లతో ‘రోబో’ సీక్వెల్?

Saturday, February 21st, 2015, 12:52:49 PM IST


ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘ఎందిరన్’ (తెలుగు ‘రోబో’) చిత్రం ఎంత ఘన విజయాన్ని సాధించిందో తెలిసిందే. అయితే భారత సినిమాను అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించి అందరి ప్రశంశలను అందుకున్న ఈ చిత్ర దర్శకుడు శంకర్ ఎందిరన్-2 చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నట్లు సమాచారం. అయితే తన ప్రాజెక్ట్ పూర్తిగా ఒక స్థాయికి వచ్చే వరకు దానిపై మాట్లాడని శంకర్ ఈ చిత్రం విషయంలో కూడా అదే సుస్పెన్సును కొనసాగిస్తున్నారని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇక ‘ఎందిరన్ -2’ లో కూడా రజనీ సరసన అందాల తార ఐశ్వర్యా బచ్చనే హీరోయిన్ గా చేయబోతున్నట్లు సమాచారం. కాగా ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఎందిరన్ (రోబో) హిట్ సాధించడంతో అదే పెయిర్ ను కొనసాగించే ఆలోచనలో దర్శకుడు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఐశ్వర్య కూడా ఇందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. కాగా రజనీ కాంత్ తో పాటు బాలివుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ను కూడా ఎందిరన్ -2 లో నటింపచేసే ఏర్పాట్లలో శంకర్ ఉన్నట్లు సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది.