నిర్భయ కేసులో సుప్రీమ్ కోర్టు సంచలన తీర్పు.. వారికి బ్రతికే హక్కు లేదు!

Monday, July 9th, 2018, 03:37:20 PM IST

నిర్భయ కేసుపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీమ్ కోర్టు ఎట్టకేలకు తన తీర్పును ఇచ్చింది. అందరూ ఉహించనట్టుగానే దోషులకు ఉరిశిక్ష సరైనదని వారు చేసిన తప్పు క్షమించరాని నేరమని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉరిశిక్షను విధించింది. ఇంతకుముందు నిందితులకు ట్రయల్‌ కోర్టు అలాగే ఢిల్లీ హైకోర్టు ఉరి శిక్షణే ఖరారు చేయగా ఆ తీర్పునూ సమీక్షించాలని నిందితులు ముఖేష్‌(29), పవన్‌ గుప్తా(22), వినయ్‌ శర్మ(23)ల తరపున రివ్యూ పిటిషన్ దాఖలవ్వడం జరిగింది.

విచారణ జరిపిన సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా అలాగే ధర్మాసనం న్యాయమూర్తులు భానుమతి, అశోక్‌ భూషణ్‌ ల ఆధ్వర్యంలో ఈ రోజు (సోమవారం) తీర్పును తెలిపింది. కింద కోర్టులు తెలిపినట్టుగా దోషులకు ఉరిశిక్ష సరైందని తీర్పులు వెలువడటంతో దేశంలో చట్టాలు కఠినతరం అవుతున్నాయి అని అనడానికి నిదర్శనమని పలువురు న్యాయవాదులు పేర్కొన్నారు.

2012 డిసెంబర్ 16వ తేదీన వైద్య విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనను ఏ మనిషి మరచిపోలేడు. ఓ మైనర్ బాలుడితో పాటు ఆరుగురు అత్యంత కిరాతకంగా అత్యాచారం జరపగా, 13 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆ యువతీ డిసెంబర్ 29న మరణించింది.

బస్సు డ్రైవర్ జైల్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతరం ముకేష్ సింగ్, వినయ్ శర్మ, పవన్ గుప్తా, అక్షయ్ కుమార్ అనే నిందితులకు 2013 సెప్టెంబర్ 13న సెషన్స్ కోర్టు ఉరిశిక్ష విధించింది. హైకోర్టు కూడా అందుకు సమ్మతించింది. మరో నిందితుడిగా ఉన్న మైనర్ బాలుడు రాజునూ యాక్ట్ ప్రకారం విచారించి విడుదల చేశారు. ఇక ఫైనల్ గా దేశం అత్యున్నత న్యాయస్థాన సుప్రీమ్ కోర్టు నేడు ఉరిశిక్షను అమలు చేసింది.