“RRR” సర్ప్రైజ్: రిస్క్ చేస్తున్నారా? – సెంటిమెంట్ రిపీట్ అయితే ..?

Thursday, February 14th, 2019, 01:17:39 PM IST

ఎన్టీఆర్, రామ్ చరణ్ ల కాంబినేషన్ లో దర్శకధీరుడు రాజమోళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ “ఆర్ ఆర్ ఆర్” గురించి అఫీషియల్ అప్ డేట్స్ ఏమీ రాకపోయినప్పటికీ రోజుకో సర్ప్రైజ్ న్యూస్ టాలీవుడ్ హల్ చల్ చేస్తోంది. తాజాగా ఈ సినిమాలో రామ్ చరణ్ ట్రిపుల్ రోల్ చేస్తున్నాడంటూ వార్త వినిపిస్తోంది, ఈ వార్త మెగా అభిమానులకు ఇంట్రెస్టింగ్ గానే అనిపించచ్చు కానీ, ఒక్కసారి ట్రిపుల్ రోల్ కు ఉన్న సెంటిమెంట్ గనక గమనిస్తే వారిలో కూడా టెన్షన్ పెరగక తప్పదు. ఎందుకంటే గతంలో స్టార్ హీరోల ట్రిపుల్ చేసిన సినిమాలన్నీ దాదాపు డిజాస్టర్స్ అయ్యాయి, మెగాస్టార్ ట్రిపుల్ రోల్ చేసిన ముగ్గురు మొనగాళ్లు, బాలకృష్ణ సుల్తాన్ అప్పట్లో డిజాస్టర్ అయ్యింది.

ఆ మధ్య ఎన్టీఆర్ చేసిన జై లవకుశ కూడా ట్రిపుల్ రోల్ అన్న సంగతి తెలిసిందే, ఆ సినిమా మీద ఎన్నో అంచనాలు ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో ఆ సినిమా ఆడలేదు. ఇప్పుడు “ఆర్ ఆర్ ఆర్” లో కూడా రామ్ చరణ్ బ్రిటిష్ ఆఫీసర్ గా, 40ల కాలం నాటి యువకుడిగా మాస్ ఆపియరెన్స్ లో, స్వాతంత్ర్య సమరయోధుడిగా మూడు క్యారెక్టర్స్ లో కనిపించనున్నాడని టాక్ హల్ చల్ చేస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలీదు గానీ, ట్రిపుల్ రోల్ కి ఉన్న సెంటిమెంట్ వర్కౌట్ అయితే గనక సినిమా పరిస్థితి ఏంటా అన్న సందేహాలు మొదలవుతున్నాయి.