ఆ విషయం గురించి బింద్రా ట్వీట్ చేస్తే.. సుష్మ సాయం చేసింది..!

Tuesday, April 12th, 2016, 11:07:58 AM IST


సుష్మా స్వరాజ్.. భారత విదేశాంగశాఖ మంత్రి. ఆ పదవి చేపట్టిన తరువాత విదేశాంగ శాఖ విధానంలో పలు మార్పులు తీసుకొచ్చింది. భారతీయులు విదేశాలలో ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొంటే… వెంటనే విదేశాంగ శాఖ రెస్పాండ్ అయ్యే విధంగా కార్యాచరణను రూపొందించింది సుష్మా. ఇబ్బందుల్లో ఉన్నామని చిన్న ట్వీట్ చేస్తే.. వెంటనే స్పందించి వారి పని చేసేపెట్టే విధంగా చేస్తున్నది సుష్మా.

ఇక ఇదిలా ఉంటే, ప్రస్తుతం బ్రెజిల్ లో ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీలలో పాల్గొనేందుకు బింద్రా కోచ్ తో కలిసి ఇండియా నుంచి బయలు దేరారు. అయితే, జర్మనీవెళ్ళగానే కోచ్ పాస్ పోర్ట్ ను ఎవరో దొంగిలించారు. ఈ విషయం గమనించిన బింద్రా.. సుష్మా ట్విట్టర్ సాయం చేయాలని కోరారు. ఇక, బింద్రా ట్వీట్ కు సుష్మా స్పందించింది. అవసరమైన ఏర్పాట్లు చేయాలని జర్మనీలోని భారత రాయభార కార్యాలయానికి ఆదేశాలు జారీ చేసింది. భారత విదేశాంగ శాఖ ఆదేశాల మేరకు జర్మనీలోని రాయబార కార్యాలయం అవసరమైన ఏర్పాట్లు చేసి వారిని బ్రెజిల్ కు పంపించింది.