హైదరాబాద్ లో స్వైన్ టెర్రర్

Saturday, January 17th, 2015, 12:48:15 PM IST


తెలుగు రాష్ట్రాలను స్వైన్ ఫ్లూ భయపెడుతున్నది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 115 కేసులు నమోదు కాగ, ఆంధ్రప్రదేశ్ లో నాలుగు కేసులు నమోదు అయ్యారు. రోజు రోజుకు స్వైన్ ఫ్లూ కేసులు పెరుగుతుండటంతో రాష్ట్రంలోని ప్రజలు బయటకు రావాలంటే కూడా భయపడుతున్నారు. ఇక హైదరాబాద్ లోని గాంధి హాస్పిటల్ కు జ్వరంతో వచ్చే రోగుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. ఈ స్వైన్ ఫ్లూ తో ఇప్పటివరకు 20మంది చనిపోయినట్టు సమాచారం.

ఫ్లూ అన్నది కేవలం చలికాలంలో వచ్చే జ్వరం మాత్రమే అని వైద్యులు చెప్తున్నప్పటికీ, ఈ ఫ్లూ వలన మరణించే వారి సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. హైదరాబాద్ లోనే ఎక్కువగా స్వైన్ ఫ్లూ వాపిస్తుండటంతో ప్రజలు గజగజవణికిపోతున్నారు. స్వైన్ ఫ్లూ కారణంగా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తున్నది.