కాంగ్రెస్ లోకి సినినటుడు కార్తిక్

Thursday, November 6th, 2014, 02:09:10 AM IST


తమిళ సిని నటుడు కార్తిక్ ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్తిక్ గతంలో తాను స్థాపించిన అఖిల ఇండియా నాదలం మక్కల్ కచ్చిని పార్టీని ఆయన కాంగ్రెస్ లో విలీనం చేశారు. కార్తీక్ 2006వ సంవత్సరంలో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అదే సంవత్సరం ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో చేరి… తమిళనాడు రాష్ట్ర విభాగానికి కార్యదర్శిగా పనిచేశారు. అనంతరం 2009లో సొంతంగా పార్టీని స్థాపించారు. అయితే.. కార్తిక్ స్థాపించిన ఆ పార్టీ.. తమిళనాడులో ప్రభావం చూపించలేకపోవడంతో….2011వ సంవత్సరంలో అన్నాడిఎంకె పార్టీతో పొత్తుపెట్టుకునేందుకు ప్రయత్నించారు. కాని అది కూడా బెడిసికొట్టింది. దీంతో కార్తీక్ నేడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్తిక్ తెలుగు సినిపరిశ్రమకు సైతం సుపరిచితుడే. ఆయన తెలుగులో సీతాకోకచిలుక, ఘర్షణ, అభినందన, అన్వేషణ తదితర చిత్రాలలో నటించారు.