తమిళతంబీల చూపు ‘రజనీ’వైపు..!

Wednesday, October 8th, 2014, 08:11:59 PM IST


తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు రజనీకాంత్ ఇంటిచుట్టూ తిరుగుతున్నాయి. అక్కడ ఉన్న రెండు ప్రధాన పార్టీలు అవినీతి కూపంలో కురుకుపోయాయి. డీఎంకె పార్టీలో వర్గపోరు, ఆధిపత్యపోరు జరుగుతున్నది. అంతేకాకుండా.. ఎన్నో కుంభకోణాలకు చిరునామాగా మారడంతో..మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికకలో ఘోరంగాదెబ్బతిన్నది . దేశంలో మోడీ హవా సాగుతున్నా.. రాష్ట్రంలో మాత్రం.. జయ హావా కొనసాగింది.
జయలలిత ఆనతికాలంలోనే.. అనేక పధకాలలో ప్రజలకు దగ్గరయింది. అయితే, అక్రమాస్తుల కేసులో ఇప్పుడు జయలలిత కర్ణాటకలోని పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్నది. అన్నాడీఎంకె కు ప్రస్తుతం ఎటువంటి ఇబ్బంది లేదు.. అమ్మ జైలులో ఉన్నా.. పన్నీర్ సెల్వం ను ముఖ్యమంత్రిని చేసింది.

అయితే, రెండు ప్రధాన పార్టీలు అవినీతి కూపంలో కూరుకుపోవడంతో.. ఇప్పుడు తమిళనాడు ప్రజల తలైవా రజనీకాంత్ వైపు చూస్తున్నారు. గతంలో రాజకీయాలలోకి రమ్మంటే.. రానని కరాఖండిగా చెప్పిన రజనీకాంత్ మరి ఇప్పుడున్న పరిస్థితులలో రాజకీయాలోకి వస్తారా? అంటే వచ్చే అవకాశాలు ఉన్నాయనే తెలుస్తున్నది. ప్రస్తుతం రజనీకాంత్ లింగా సినిమా షూటింగ్ లో ఉన్నారు. అనంతరం.. రజనీకాంత్ రాజకీయరంగ ప్రవేశం చేయవచ్చని జోరుగా ప్రచారం సాగుతున్నది. బీజేపి తరుపున ఆయన బరిలోకి దగనున్నట్టు కూడా తెలుస్తున్నది.

ఇటీవలే.. తమిళనాడు బీజేపి అధక్షుడు సౌందరాజన్ రజనీకాంత్ సతీమణిని కలిశారు. సౌందరాజన్ రజనీకాంత్ సతీమణిని కలవడంతో.. అప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి. రజనీకాంత్ బీజేపిలో చేరబోతున్నాడని.. ఒకవేళ చేరితే.. రజనీకి ఏపదవి ఇవ్వబోతున్నారు.. అని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే, సౌందరాజన్ మోడీ గురించి.. పుస్తకం రాస్తున్నారు.. ఆ పుస్తకానికి సంబంధించి కొన్ని మార్పులు చేర్పుల కోసం ఆయన రజనీకాంత్ ఇంటికి వెళ్లినట్టు వెల్లడించారు. రజనీకాంత్ తిరిగి వచ్చాక… సౌందరాజన్ తిరిగి మరలా ఒకమారు కలవనున్నారు. రజనీకాంత్ రాజకీయరంగ ప్రవేశం, బీజేపిలో చేరిక మొదలైన విషయాలు నిజమో కాదో తెలియాలంటే.. మరికొన్ని రోజులు ఆగాల్సిందే.