టీడీపీ ఎమ్మెల్యేను ఎలా చంపేశారో కళ్ళకు కట్టినట్టు చెప్పిన డ్రైవర్..!

Tuesday, September 25th, 2018, 03:58:47 AM IST

అరకు టీడీపీ ఎమ్మెల్యే సర్వేసర రావును మరియు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను అతి దారుణంగా మావోయిస్టులు హత్య చేసిన సంగతి తెలిసినదే,ఈ విషయం పట్ల వారి పార్టీ నాయకులు మరియు వారి కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి లోనయ్యారు,చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన సంతాపాన్ని తెలిపారు,అసలు ఇంతటి దారుణానికి ఒడిగట్టిన మావోలు సర్వేసరరావుని మరియు సివేరి సోమాలు ఎలా చంపారో అప్పుడి వారి కారు డ్రైవరుగా ఉన్నటుంవంటి కే.చిట్టిబాబు అనే వ్యక్తి వివరంగా తెలియజేసారు.

కే.చిట్టిబాబు అనే వ్యక్తి మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ వద్ద డ్రైవరుగా పని చేసేవాడినని,వారు కారులో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా మావోయిస్టులు చుట్టుముట్టేశారని,ఆ తరువాత వారిలో సోమా గారిని మరియు సర్వేసర రావు గారిని బయటకు లాగి వారి చేతులను వెనక్కి కట్టేసి అడవుల్లోకి తీసుకెళ్లిపోయారని,తనతో పాటు మిగతా సహచరులను ఒక దగ్గర పెట్టి వారిని దూరంలో ఉంచి తలకు తుపాకిని గురి పెట్టి ఎవరైనా పారిపోయేందుకు ప్రయత్నిస్తే అక్కడే కిరాతకంగా చంపేస్తాం అని, హెచ్చరించారని చిట్టిబాబు తెలిపారు,ఆ తరువాత సోమా గారిని అక్కడి నుంచి లోపలకి తీసుకెళ్లి అతి దారుణంగా హతమార్చారని చిట్టిబాబు తెలిపారు.