క‌ళ్యాణ్ రామ్ 118 మూవీ టీజ‌ర్.. నంద‌మూరి అభిమానులు ఊహించ‌ని విధంగా..!

Tuesday, December 18th, 2018, 02:00:59 PM IST

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా, కేవీ గుహన్ దర్శకత్వంలో మహేష్ కోనేరు నిర్మించిన చిత్రం 118. తాజాగా ఈ చిత్రం టీజర్ విడుదలైంది, అందమైన విజువల్స్ తో , ఉత్కంఠ రేపే సస్పెన్స్ ఎలిమెంట్ తో ఉన్న ఈ టీజర్ సినిమాపై అందరిలో ఆసక్తి రేపుతోంది. టీజర్ ప్రథమార్థంలో కళ్యాణ్ రామ్ షాలిని పాండేల మధ్య వచ్చిన రొమాంటిక్ సీన్స్ చుస్తే సినిమాలో లవ్ ట్రాక్ కూడా బాగా వర్కౌట్ అయ్యేలా ఉంది అనిపిస్తోంది. స్వతహాగా సినిమాటోగ్రాఫర్ అయిన దర్శకుడు గుహన్ విజువల్స్ పై ప్రత్యేక శ్రద్ధ వహించినట్టు అర్థమవుతుంది. మహేష్ కోనేరు ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సినిమా కు రిచ్ లుక్ తెచ్చేలా ఉన్నాయి. కొంత కాలం వరకు ఆనందంగా సాగిన కళ్యాణ్ రామ్ షాలినిల ప్రయాణం, ఒకరోజులో ఊహించని మలుపు తిరుగుతోంది అన్న అంశాన్ని టీజర్ లో హైలైట్ చేసారు. శేఖర్ చంద్ర సంగీతం అందించగా, ఈస్ట్ కాస్ట్ బ్యానేర్ పై మహేష్ కోనేరు నిర్మించిన ఈ చిత్రం సంక్రాతి తర్వాత విడుదల కానుంది. మహేష్ కోనేరు, కళ్యాణ్ రామ్ ల కాంబినేషన్ లో గతంలో నా నువ్వే సినిమా వచ్చింది, ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యింది. 118 టీజర్ చుస్తే, కళ్యాణ్ రామ్, మహేష్ కోనేరులకు ఈ సారి హిట్ ఖాయం అన్న అభిప్రాయం కలుగుతోంది.