టెక్ కంపెనీలకు వీసాల వల్ల దెబ్బ!

Sunday, July 22nd, 2018, 06:08:50 PM IST

వివిధ దేశాలకు ఉద్యోగ విషయమై వెళ్తున్న అభ్యర్థుల వీసాల జరీ విధానాల వలన టెక్ కంపనీలు తీవ్ర సమస్యలు ఎదుర్కోవలసి వస్తోందని, టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ స్పష్టం చేస్తోంది. అగ్ర రాజ్యమైన అమెరికా వీసాల విషయంలో ఇదివరకు ఎన్నడూ లేనంత క్లిష్ట పరిస్థితులు వీసా జారీల విషయంలో కల్పిస్తున్నాయని, ఇది అమెరికా అధ్యక్షులు ట్రంప్ చేపట్టిన విధానాల వల్లనే ప్రముఖంగా జరుగుతోందని అంటోంది. అమెరికన్ పౌరులకు, అలానే స్థానికతకు పెద్ద పీట వేయాలన్న తలంపుతోనే విదేశీయులను అమెరికా వచ్చే విషయమై ఈ విధంగా పలు విధాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ఆ కంపెనీ ఆరోపిస్తోంది. ఇప్ప్పటికే వీసాలను అప్లై చేసుకున్న వారు వాటి జారీ ఆలస్యం అవుతుండడం,

అలానే కొందరివి తిరస్కరించబడుతుండడంతో కంపెనీల ఖర్చు పెరిగిపోతోందని, దానివల్ల కంపెనీల ప్రాజక్టు వ్యయం తడిసి మోపెడవుతోంది అని, తద్వారా కొందరు ఉద్యోగులు తమ ఉద్యోగాలను సైతం కోల్పోవలసి వస్తోందని చెపుతున్నారు. ఇటీవల ఇన్ఫోసిస్ ఏర్పాటు చేసిన నాలుగు టెక్నాలజీ మరియు ఇన్నివేటివ్ హబ్ లలో మొత్తం పదివేలమంది అమెరికన్లను నియమించుకోవాలని అక్కడి ప్రభుత్వం ఆదేశించగా ఇప్పటివరకు నాలుగు వేల మందిని నియమించుకోవడం జరిగిందని చెప్పారు. అయితే అమెరికా దేశ ఈ విధమైన నియంతృత్వ విధానాల వల్ల పలు దేశాలనుండి అక్కడికి ఉద్యోగార్ధమై వెళ్తున్న వారు జంకుతున్నారని, వీసాల నిబంధనల్లో ఇంతటి కఠినతరం మార్పులు చేయడం వల్ల వారు ఆ దేశానికి కాక ఇతర దేశాలవైపు చూడటానికి కూడా మరొక కారణంగా నిలుస్తున్నారని అన్నారు…..