కెసిఆర్ కోరికను బాలయ్య తీరుస్తాడా..?

Friday, April 22nd, 2016, 01:32:25 PM IST


గౌతమిపుత్ర శాతకర్ణి ప్రారంభోత్సవ కార్యక్రమానికి కెసిఆర్ ముఖ్య అతిధిగా హాజరయ్యి అందరిని ఆశ్చర్యపరిచారు. బాలకృష్ణ సినిమా ప్రారంభోత్సవానికి క్లాప్ ను కూడా కొట్టారు కెసిఆర్. అనంతరం కెసిఆర్ మీడియాతో మాట్లాడుతూ.. గౌతమిపుత్ర శాతకర్ణి తెలుగు ప్రజలు గర్వించదగిన రాజని.. ఆయన కథను వస్తువుగా తీసుకొని సినిమా చేయడం పెద్దసాహసంతో కూడుకున్న పని అని.. బాలకృష్ణ ఈ సాహసానికి పూనుకోవడం అభినందించదగిన విషయం అని చెప్పారు. తనకు ఒక కోరిక ఉన్నదని దానిని బాలయ్య తీర్చారని అన్నారు. తెలుగు ప్రజలు ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన వ్యక్తి కథను తీసుకొని చేస్తున్న ఈ సినిమా పూర్తయ్యాక .. తనకు చూపించాలని బాలయ్యను సభాముఖంగా కోరారు. కుటుంబ సభ్యులతో కలిసి గౌతమి పుత్ర శాతకర్ణి చూడాలని అనుకుంటున్నట్టు కూడా కెసిఆర్ పేర్కొన్నారు. మరి స్వయంగా ముఖ్యమంత్రే కోరిక కోరితే.. బాలయ్య కాదంటాడా చెప్పండి.