సమ్మె ముగిసింది!

Wednesday, May 13th, 2015, 04:57:39 PM IST


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖామంత్రి అచ్చెం నాయుడు రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె ముగిసినట్లేనని బుధవారం విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులకు అసంతృప్తి లేకుండా చెయ్యాలని వారు అడిగిన 43% ఫిట్ మెంటుకు అంగీకరించమని తెలిపారు. అలాగే ప్రభుత్వ ఇబ్బందులు, సంస్థ ఇబ్బందులను కార్మికులకు చెప్పి కొంత త్యాగాలు చెయ్యాలని సూచించామని, దానికి కార్మికులు అంగీకరించడంతో నేటితో సమ్మె పూర్తిగా ముగిసినట్లేనని అచ్చెం నాయుడు స్పష్టం చేశారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ కొత్త రాష్ట్రం కావడంతో అనేక సమస్యలు ఉన్నాయని, ప్రభుత్వానికి ఇబ్బందులు ఉన్నాయని, ఆర్టీసీ సంస్థ 4వేల కోట్ల రూపాయల నష్టాల్లో నడుస్తోందని తెలిపారు. అలాగే 1200కోట్ల మేరకు ఎరియర్స్ ఉన్నాయని, వాటిని ఇప్పటిక్పిప్పుడు ఇచ్చే అవకాశం లేదు కాబట్టి రిటైర్మెంటు సమయంలో ఇస్తామని చెప్పామని, అందుకు కార్మికులు అంగీకరించారని అచ్చెం నాయుడు వివరించారు. ఇక ఇప్పట్లో ఆర్టీసీ బస్ చార్జీలు పెంచే ఆలోచన లేదని మంత్రి అచ్చెం నాయుడు స్పష్టం చేశారు.