కాల్పుల బీబత్సం.. అమెరికాలో తెలుగు యువకుడు మృతి!

Friday, September 7th, 2018, 12:47:11 PM IST

అమెరికాలో మరోసారి విచక్షణ రహిత కాల్పులు అందరిని షాక్ కి గురి చేశాయి. ఓ దుండగుడు జరిపిన కాల్పులకు నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. సిన్సినాటిలోని వాల్‌నట్‌ స్ట్రీట్‌లోని బ్యాంక్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మరణించిన వారిలో తెలుగు వ్యక్తి కూడా ఉన్నాడు. గుంటూరు జిల్లా తెనాలి ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల పృథ్వీ రాజ్ ఘటనలో మరణించినట్లు అమెరికా పోలీసులు నిర్దారించారు.

ఇక కాల్పులు జరిపిన ఒమర్ ఫెరాజ్ ను కూడా పోలీసులు ఎదుర్కొని అతన్ని కాల్చేశారు. ఇక ఈ విషయంపై భారత రాయబార కార్యాలయం స్పందించి వివరణ ఇచ్చింది. బ్యాంక్ లో పనిచేస్తున్న గుంటూరు వాసి పృథ్వీ రాజ్ కాల్పుల్లో మరణించినట్లు వెల్లడించారు. త్వరలోనే అతని మృతదేహాన్ని భారత్ కు తరలించేందుకు ఏర్పాట్లు చేయనున్నట్లు అధికారులు తెలిపారుల. విషయం తెలియగానే పృథ్వీ రాజ్ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.