అమెరికాలో తెలుగు స్టూడెంట్ మర్డర్ !

Sunday, July 8th, 2018, 12:08:16 PM IST

ఇప్పటికే అమెరికా అధ్యక్షులు ట్రంప్ పెడుతున్న ఆంక్షలు, ఎదురవుతున్న అడ్డంకులతో అమెరికాకు పై చదువులకు, ఉద్యోగాలాలు వెళ్లాలంటేనే విదేశస్థులు అందరూ కొంత జంకుతున్నారు. మరీ భారత్, చైనా వారికి సైతం అక్కడి ఇమ్మిగ్రేషన్ తదితరాలు కఠినతరం అవడంతో, ముఖ్యంగా దేశస్థులు అమెరికా, కాకుండా ఇతర దేశాలవైపు చూస్తున్నారు. ఇకపోతే ఈ మధ్య అక్కడ జాత్యహంకార దాడులు మరింత పెరిగాయి. ఇటీవల మన తెలుగువారిపై అక్కడ జరిగిన కాల్పుల ఉదంతం మరువక ముందే నిన్న మరోక తెలుగు విద్యార్ధి అక్కడి దాడులకు బలయ్యాడు. ఇక వివరాల్లోకి వెళితే, అమెరికా లోని కేన్సస్ నగరంలో ఒక స్థానిక రెస్టారెంట్లో నిన్న సాయంత్రం శరత్ కొప్పుల పై కొందరు దుండగులు ఐదు రౌండ్లు కాల్పులు జరిపారు. బుల్లెట్ గాయాలతో తీవ్ర రక్త స్రావంతో కొట్టుమిట్టాడుతున్న అతన్ని పోలీస్ లు వెంటనే హాస్పిటల్ కి షిఫ్ట్ చేసారు. అయితే అప్పటికే మార్గమధ్యం లోనే అతడు చనిపోయినట్లు డాక్టర్లు ధృవీకరించారు. కాగా శరత్ పై కాల్పులు జరిపారని, అతని పరిస్థితి విషమంగా ఉందని అతని స్నేహితుడు శరత్ కుటుంబ సబ్యులకు ఫోన్ ద్వారా నిన్న తెలియపరిచారు. విషయం విన్న అతని తల్లితండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.

శరత్ వరంగల్ జిల్లా కరీమాబాద్ వాసి. ఆయన తండ్రి రామ్మోహన్ హైదెరాబాద్ బిఎస్ఎన్ఎల్ లోఉద్యోగి . తల్లి మాలతీ వరంగల్ లొని పర్వతగిరి పంచాయతీ రాజ్ శాఖలో ఈవోఆర్డీ గా పని చేస్తున్నారు. వారికీ ఒక కుమార్తె తోపాటు, శరత్ ఒక్కడే కొడుకు. ఆరు నెలల క్రితం ఎంఎస్ చదువుకోసం అమెరికా వెళ్లిన అతడు, పార్ట్ టైం జాబ్ గా ఒక చికెన్ స్టాల్ కామ్ రెస్టారెంట్లో పని చేస్తున్నాడు. కాల్పుల ఘటన అక్కడే జరిగింది. అయితే నిన్న రోజు మాదిరి ఒకతను ఫుడ్ కోసం వచ్చి తిని, బిల్ ఎంత అయింది అని అడిగాడని, బిల్ 30 డాలర్లు అయింది అని చెప్పగానే వెంటనే శరత్ పై కాల్పులు జరిపాడని, మరి అతనిపై వారికీ ఏదైనా వ్యక్తిగత కక్ష ఉందా లేక, మరేదైనా కారణం చేత కల్చరా అనేది దర్యాప్తులో తెలియాల్సి ఉందని అక్కడి పోలీస్లు చెపుతున్నారు. శరత్ మరణ వార్త తెలియగానే కుప్పకూలిన తల్లితండ్రులు ఇక్కడి హైదరాబాద్ చేరుకొని డిజిపిని అక్కడి రాయబార అధికారులతో మాట్లాడి, జరిగిన విషయమై వాకబు చేసి, వెంటనే శరత్ డెడ్ బాడీని ఇక్కడికి రప్పించేలా చేయమని కోరారు. ఈ ఘటనతో కరీమాబాద్ ప్రాంతం విషాదంలో మునిగిపోయింది……