టాలివుడ్ నుంచి సిఎం నిధికి భారీ విరాళం

Sunday, November 30th, 2014, 09:15:02 PM IST


టాలివుడ్ సినీ పరిశ్రమ మేము సైతం కార్యక్రమం ద్వారా సేకరించిన 11,51,56,116/- రూపాయల భారీ మొత్తాన్ని సిఎం సహాయ నిధికి అందజేశారు. ఈ చెక్ ను మేము సైతం కార్యక్రమానికి ముఖ్యఅథిదిగా హాజరైన ముఖ్యమంత్రి చంద్రాబాబు నాయుడికి అందించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడారు. హుధూద్ తుఫాను బాధితులను ఆదుకోవడానికి తెలుగు సినిపరిశ్రమ ముందుకు రావడం అభినందనీయమైన విషయమని అన్నారు. తెలుగు వారికి రెండు రాష్ట్రాలు ఉన్నాయని… రెండు రాష్ట్రాలలోని ప్రజలు సంతోషంగా ఉండాలని ఆయన తెలిపారు. ప్రపంచంలో తెలుగు ప్రజలు ఎక్కడున్నా వారికి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా… ఆదుకోవడానికి తెలుగుదేశం ప్రభుత్వం సిద్దంగా ఉన్నదని ఆయన అన్నారు. హుధూద్ తరువాత విశాఖ దారుణంగా మారిపోయిందని… అనంతరం ఒక్క నెలలోనే తిరిగి కోలుకున్నదని చంద్రబాబు నాయుడు అన్నారు.

ఈ భారీ మొత్తంతో… విశాఖలో మోడల్ కాలనీని నిర్మించాలని సినీ పరిశ్రమకు ఆయన సూచించారు. సినిపరిశ్రమ సేకరించిన మొత్తంతో పాటు మరో 11కోట్ల రూపాయలు ఇస్తామని ఆయన ఈ సందర్భంగా బాబు తెలిపారు.