పెళ్లి వద్దన్నాడని ప్రియుడిని చంపి, బిర్యానీ వండింది…

Wednesday, November 21st, 2018, 04:46:34 PM IST

నేటి కలియుగం లో ఎన్నెన్ని గోరాలు, ఎన్నెన్ని దారుణాలు జరుగుతున్నాయో, అసలు ఎందుకు, ఎవరికోసం, ఏ విధంగా, ఎక్కడెక్కడ జరుగుతున్నాయో ఊహించలేని పరిస్థితి ఏర్పడుతుంది. మన మానవ జాతిలో ఓర్పు, సహనం, మానవత్వం, జాలి అనే అంశాలు రోజురోజుకి క్షీణించిపోతున్నాయి. చిన్న చిన్న కారణాలకే సహనాన్ని కోల్పోయి విచక్షణా రహితంగా ప్రవర్తిస్తున్నారు. ఎదుటివారిని చంపడమే కాకుండా, చనిపోయిన వారి మృతదేహాలతో నీచమైన, వికృతమైన చర్యలకి పాల్పడుతున్నారు. దుబాయ్ లో నివసిస్తున్న ఒక మొరాకో దేశస్తురాలు ప్రేమించిన వ్యక్తి తో కలిసి 7ఏళ్లుగా సహజీవనం చేస్తుంది. త్వరలో అతడిని పెళ్లి చేసుకుంటానని ఆనందంగా ఉంది. అంత సక్రమంగానే సాగుతున్న ఈ తరుణం లో ఆ ప్రేమికుడు ఆమెకి ఒక చేదు వార్త వినిపించాడు. సారీరా బంగారం, నువ్వు అంటే నాకు చాల ప్రేమ, కానీ నిన్ను పెళ్లి చేసుకోలేను, మా మరదలిని చేసుకుంటున్నాడు అని తేల్చి చెప్పేసాడు.

దీనితో ఆమె తీవ్ర ఆగ్రహానికి గురై, ఆమె కోపం కట్టలు తెంచుకుంది. అంతే ఇక 7ఏళ్ళు నాటో ప్రేమాయణం నడిపి, చివరికి నన్ను నట్టేట్లో ముంచేస్తావా అంటూ కోపం పెంచుకుంది. సదరు ప్రేమికుడిని బతిలాడింది, వేడుకుంది, అయినా కూడా అతడు కరగలేదు. అంతే ఆమె తన ప్రేమికుడిని చంపేద్దామని పక్క పథకం వేసుకొని, చివరికి అతడిని హతమార్చింది. చనిపోయాడని నిర్దారించుకున్న ప్రియురాలు, ఆ ప్రియుడి శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికేసి బిర్యానీ వండింది. అదే పరిసరాల్లో దినసరి కూలీలుగా పని చేస్తున్న పాకిస్తాన్ కి చెందిన కొందరు కూలీలను ఆహ్వానించి, అది మొరాఖో ప్రత్యేక వంటకమని చెప్పి, వారికి వడ్డించింది. వారు కూడా చాల బాగుంది అని మొత్తం తినేశారు. వండటానికి వీలు లేని పెద్ద పెద్ద భాగాలని కుక్కలకి వేసింది. ఆ తరువాత కొన్ని రోజులకి సదరు మృతుడి సోదరుడు తన ఆచూకీ వెతుక్కుంటూ వారి ఇంటికి వెళ్ళాడు. ఆ సమయంలో ఆమె ప్రవర్తన అంతా విచిత్రంగా ఉండటంతో, అనుమానం వచ్చి ఆ సోదరుడు పోలీసులకి ఫిర్యాదు చేసాడు. పోలీసులు ఆమె ఇంటికి వెళ్లి తనిఖీ చేయగా, మిక్సీ బ్లెండర్ లో మనిషి పన్ను దొరికింది. ఆ పన్ను కు డిఎన్ఏ పరీక్షా చేపించగా విషయం బయట పడింది. ఆ నిందితురాలిని పోలీసులు పట్టుకొని విచారించగా నేరం అంగీకరించింది. ఇంతటి ఘోరానికి దిగజారిన ఆ నిందితురాలికి తగిన శిక్ష పడాలని మృతుడి బంధువులు ఆరోపించారు.