మటన్ కోసం కూతురి హత్య…

Friday, November 16th, 2018, 03:28:26 PM IST

మటన్ త్వరగా వండలేదనే కోపం తో భార్యతో గొడవపడుతుండగా, అడ్డొచ్చిన తన నాలుగేళ్ళ కూతురిని నిర్దాక్షిణ్యంగా తలని నేలకేసి కొట్టి చంపాడో కసాయి తండ్రి. ఈ హృదయవిదారక ఘటన బీహార్ లోని అమౌర్ లో జరిగింది. నిందితుడు శోభాలాల్ శర్మ సూరత్‌లోని ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. ఇటీవలఅక్కడ జరుగుతున్నా చట్ పూజల సందర్భంగా స్వస్థలానికి వచ్చాడు. ఆ రోజు మధ్యాహ్నం 1 దాటినా కానీ మటన్ ఇంకా వండలేదనే కోపంతో భార్య రాజా కుమారి దేవి తో గొడవకి దిగాడు శోబాలాల్ శర్మ. తనకు ఎంతో ఇష్టమైన మటన్ కూర వండటం చాలా ఆలస్యం కావడంతో భార్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఆ సమయంలో ఇంట్లో ఆడుకుంటున్న నాలుగేళ్ళ కుమార్తె షాలు కుమారి మెడ పట్టుకుని తలను నేలకేసి కొట్టాడు. అపస్మారక స్థితికి చేరుకున్న షాలును వెంటనే దగ్గరలోని హాస్పిటల్ కి తీసుకెళ్లారు. అప్పటికే శాలు ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు శర్మను అరెస్టు చేశారు. నిందితుడి భార్య రాజా కుమారి దేవి గతం లో శర్మ అన్న ని పెళ్లి చేసుకుంది. తాను మరణించడంతో, కొన్ని ఏళ్ళ కిందట నిందితుడు రాజకుమారి ని పెళ్లి చేసుకున్నాడు. వీరికి శాలు కుమారి జన్మించింది. గతాహం లో కూడా వీరికి చాలా సార్లు గొడవలు జరిగాయని స్థానికులు చెబుతున్నారు. ఈసారి జరిగిన గొడవలో అనవసరంగా చిన్నారి ప్రాణాలు కోల్పోయినందుకు స్థానికులు తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు.