కసాయి కొడుకు చేతిలో చంపబడ్డ తల్లి

Tuesday, December 25th, 2018, 02:43:36 PM IST

ఈ కాలం లో కూడా మంత్రాల నెపంతో తన కన్న తల్లి నే చంపాడు ఒక కసాయి కొడుకు. తన తల్లి మంత్రాల చేస్తున్నదని చెప్పిన ఇరుగు పొరుగు వాళ్ళ మాటలు నమ్మి, నిజానిజాలు తెలుసుకోకుండా తల్లి ని ఎవరు లేని సమయంలో గొంతు నులిమి చంపేశాడు. ఈ గోరమైన సంఘటన బోయినపల్లి మండలం విలాసాగర్‌ గ్రామంలో చోటుచేసుకొంది. జంగపెల్లి చంద్రవ్వ–నర్సయ్య దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. వాళ్ళ కొడుకు శ్రీనివాస్‌ జీవనోపాధి కోసం కువైట్‌ వెళ్లి నాలుగు నెలల క్రితం వచ్చాడు.

ఇంట్లో ఉంటే అనవసరమైన ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని, తన భార్య కుమారుడుతో కలిసి పొరుగూరిలో వేరే కాపురం పెట్టాడు. తన తల్లి చంద్రవ్వ మంత్రాలూ చేయడం వల్లే తనకి ఈ పరిస్థితి వచ్చిందని, అందుకోసమనే ఇప్పటికి కూడా తన ఆరోగ్యం బాగుపడటం లేదని ఇరుగుపొరుగు వారు చెప్పింబ మాటలు నమ్మినటువంటి శ్రీనివాస్, దానికి విరుగుడుగా కూడా పూజలు చేపించుకున్నాడు. ఎంతకీ తగ్గకపోవడంతో విలాసాగర్ గ్రామంలోని తన ఇంటికి వెళ్లి, ఎవ్వరు లేని సమయంలో నిద్రిస్తున్న చంద్రవ్వ గొంతు నులిమి ప్రాణం తీసాడు.

ఎవ్వరికి అనుమానం రాకుండా ఉండేందుకు తాను పడుకున్న బల్ల మీది నుండి కింద పడి మృతి చెందిందని తన తండ్రికి ఫోన్ చేసి చెప్పి నమ్మ బలికాడు. కానీ అనుమానం వచ్చి కుటుంబ సభ్యులు నిలదీయడంతో తానె చంపినట్లు ఒప్పుకున్నాడు మిందితుడు శ్రీనివాస్.