అనుమానం పెనుభూతమయ్యింది – పిల్లలు అనాథలయ్యారు…

Friday, January 11th, 2019, 05:00:48 PM IST

భార్య మీద పెంచుకున్న అనుమానం పెనుభూతమయ్యింది. చివరికి ప్రాణాలు తీసే పరిస్థితి కి వచ్చింది. దీంతో వారి పిల్లలు అనాధలుగా మారారు. ఈ దారుణమైన సంఘటన అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం వ్యాసపురం గ్రామంలో జరిగింది. వ్యాసపురంలో నివాసముండే మరన్నకు గత కొంతకాలంగా తన భార్య విశాలపై అనుమానం ఉంది. అందువలన వర్రీకి తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. అదే క్రమంలో ఆరోజు రాత్రి కూడా భార్యాభర్తల మధ్య కూడా తీవ్రంగా గొడవ జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన భర్త తన భార్యను గొడ్డలితో దారుణంగా నరికి చంపాడు.

అంతేకాకుండా తానూ కూడా సమీపంలోని చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో వారి పిల్లలిద్దరూ కూడా అనాథలయ్యారు. వారిని చూసి గ్రామస్తులందరూ కూడా కంటతడి పెట్టుకున్నారు. ఈ సంఘటనతో ఇరువురి బంధువులు ఆందోళనకి దిగారు.