దొంగతనానికి వచ్చి ఆపై మహిళను ఏమిచేశారంటే….. ?

Sunday, July 15th, 2018, 04:09:54 PM IST

నేడు దేశంలో మహిళలపై లైంగిక దాడులు, అత్యాచారాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఈ రకమైన పరిస్థితి కొంత కలవరపెడుతోంది. అంతే కాక ఇటీవల ఒక అంతర్జాతీయ సర్వే సంస్థ మహిళా రక్షణ పై నిర్వహించిన సర్వేలో నిర్ఘాంతపోయే విషయాలు తెలిసాయి. ఇదివరకటితో పోలిస్తే చాల వరకు దేశాలు మహిళా రక్షణకు తగు చర్యలు తీసుకోవడంలేదని, అన్నిటికంటే మన దేశంలోనే మహిళలకు ఎక్కువ ప్రమాదం పొంచి ఉందని ఆ సర్వే నివేదిక చెప్పిన విషయం తెలిసిందే. ఇక విషయంలోకి వెళితే, లక్నౌ లోని సంభాల్ జిల్లాలోని ఒక మారుమూల ప్రాంతంలోని ఒక ఇంట్లో తన బిడ్డతో నిద్రిస్తుండగా, ఐదుగురు దొంగలు ఆ ఇంట్లో దొంగతనానికి వచ్చారు. అయితే విషయాన్నీ గమనించిన మహిళ వారిని అడ్డగించబోగా ఆ అయిదుగురు ఆమెను కొట్టి బలవంతంగా ఆమెపై అత్యాచారం జరిపారు.

కాగా ఘటన అంతరం మహిళ తన భర్తకు ఫోన్ చేయబోగా, అతని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో వెంటనే 100కు ఫోన్ చేసింది. అయితే వారు సరిగా స్పందించకపోవడంతో తమ బంధువు ఇంకొకరికి ఫోన్ చేసి విషయం చెప్పింది. కాగా కాసేపటికి మళ్ళి తిరిగివచ్చిన ఆ దుండగులు స్థానిక యజ్ఞ శాల ఆలయం వద్దకు ఆమెను లాక్కెళ్లి సజీవ దహనం చేశారు. అయితే ఘటన విషయం తెలుసుకున్న ఆమె భర్త కన్నీరుమున్నీరయ్యారు. అత్యాచారం అనంతరం భార్య తనకు ఫోన్ చేయ ప్రయత్నించిందని తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసివుండడంతో, 100కు ఫోన్ చేసినా ఉపయోగం లేకపోవడంతో తన బందువుకు ఫోన్ చేసిందని అన్నారు. కాగా ఘటన పై కేసు నమోదు చేసిన పోలీస్ లు నిందితులంతా కూడా స్థానిక ప్రాంతానికి చెందిన వారే అని గుర్తించారు.అంతే కాదు ఘటనకు ముందు మరియు ఆ తరువాత ఆమె మాట్లాడిన ఫోన్ కాల్స్ ను ట్రేస్ చేస్తున్నామని, వాటి ఆధారంగా వారికీ శిక్ష ఖరరావు అవుతుందని చెపుతున్నారు…..