అబద్దాలతో అమ్మాయిని నమ్మించి తీసుకెళ్లి…..ఆపై…?

Friday, July 27th, 2018, 04:30:45 PM IST

ఇటీవల రోజుల్లో స్త్రీలపై, బాలికలపై విచక్షణరహితంగా కొందరు నీచులు కామవాంఛతో వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అయితే చట్టాల్లో ఇటువంటివారికి శిక్షలు మరింత కఠినతరం చేస్తేనేకాని మహిళల రక్షణ కొంతవరకు జరగదని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక విషయంలోకి వెళితే, పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి గ్రామంలో ఇద్దరు యువకులు ఒక విద్యార్థినిపై ఘోరంగా అత్యాచారం జరిగిపిన ఘటన ఆ ప్రాంతవాసులని తీవ్ర విస్మయానికి గురి చేసింది. చింతలపూడి సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో ఉండి పదవతరగతి చదువుతున్న ఒక విద్యార్థినిని రెండు రోజుల క్రితం కిరణ్, చిట్టిబాబు అనే యువకులు మీ ఊరు తీసుకుని వెళ్తాము అని మాయమాటలు చెప్పి నమ్మించి ఆ అమ్మాయిని పక్కనే వున్న కవ్వగుంట గ్రామానికి తీసుకెళ్లి, అక్కడ గ్రామ శివారులోని ఒక గదిలో నిర్బంధించి విచక్షణారహితంగా ఆమెపై అత్యాచారం జరిపారు.

అయితే ఆమె ఎంత బాధపడినా కూడా వదిలిపెట్టకుండా రెండురోజులనుండి ఆమెను చిత్రహింసలు పెట్టారు. కాగా రెండు రోజుల క్రితం నుండి ఆ అమ్మాయి కనిపించడంలేదని, చింతలపూడి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు ఆ వసతి గృహ సంరక్షణాధికారి. అయితే వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీస్ లు బాలిక కోసం వెతుకులాట మొదలెట్టారు. చివరకు కవ్వగుంట శివారులో ఉందని ఆచూకీ తెలుసుకున్న పోలీసులు బాలికను విడిపించి వైద్య్ పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కిరణ్, చిట్టిబాబులను అదుపులోకి తీసుకున్నారు. బాలికలు ఎవరు పడితే వారు చెప్పే మాయామాటలను అమాయకంగా నమ్మి మోసపోవద్దని పోలీస్ లు హెచ్చరిస్తున్నారు…..