తల్లి శవం పక్కనే మూడు రోజులు ఉన్న చిన్నారి!

Sunday, June 3rd, 2018, 12:27:41 AM IST

అమెరికాలో కొన్ని రోజుల క్రితం జరిగిన ఒక ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది. ఎందుకంటే ఘటన జరిగిన విధానానికి ఆశ్చర్య పోవాలో జాలిపడాలో అర్ధం కాదు. నవ్వు ఆకలి తప్ప మరేమి తెలియని ఓ మూడేళ్ల చిన్నారి తల్లి శవం పక్కనే మూడు రోజులు గడిపింది. ఒక్కసారి ఆ చిన్నారి అక్కడ ఎలా ఉండగలిగిందో ఊహించుకుంటేనే షాకింగ్ అనిపిస్తోంది. అసలు మ్యాటర్ లోకి వెళితే.. కనెక్టికట్ ఈస్ట్ హార్ట్ అనే అపార్ట్ మెంట్ లో రెండు రోజులుగా దుర్వాసన వస్తుండడం తోటి వారు గమనించారు. మూడవరోజు ఎక్కువ కావడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

సమాచారం అందుకున్న పోలీసులు.. దుర్వాసన వస్తున్న ఇంటి డోర్ కొట్టారు. ఎవరు తీయలేదు. ఇంతలో చిన్న చిన్న అడుగుల శబ్దం వినిపించి వెంటనే డోర్ తెరుచుకుంది. ఓ చిన్నారి చేతిలో బొమ్మని పట్టుకొని ఎవరు కావాలని అడిగింది. ఎవరున్నారు ఇంట్లో అని పోలీసులు అడగ్గానే మా అమ్మ పడుకుందని ఆ పాప చెప్పింది. ఒక పొలిసు అధికారి ఆ చిన్నారిని మాట్లాడుతుండగా మరో పోలీస్ ఇంట్లోకి వెళ్లాడు. మొత్తం ఇంట్లో ఎదో గొడవ జరిగి ఉంటుందని అక్కడి వాతావరనాని చూసి వారు పసిగట్టారు.

ఎడమవైపు ఉన్న బెడ్ రూమ్ డోర్ తీయడంతో పొలిసు షాక్ అయ్యాడు. రూమ్ మొత్తం ప్రశాంతంగా ఉంది కానీ భరించాలేని దుర్వాసన. బెడ్ పై ఎవరో దుప్పటి కప్పుకొని పడుకున్నట్లు అనిపించి పోలీస్ దాన్ని తీయగా ఒక్కసారిగా కళ్లు బయర్లుగమ్మాయి. ఆమె దాదాపు కుళ్లిపోయిన స్థితికి వచ్చింది. శవం రంగు మొత్తం నల్లగా మారిపోయింది. శవం నోటి దగ్గర ఆహార పదార్థాలు ఉండడం గమనించారు. ఆ 35 ఏళ్ల మహిళ చనిపోయి మూడు రోజులు అయ్యిందని తెలిసింది.

ఇక నాలుగేళ్ల చిన్నారి తల్లి చనిపోయిందని తెలియక మూడు రోజుల పాటు శవం దగ్గరే జీవితాన్ని గడిపింది. నిద్ర వస్తే తల్లి దగ్గరే పడుకుంది. ఫ్రీజ్ లో ఉన్న ఫ్రూట్స్ ఆహారపదార్థాలు కిచెన్ లో ఉన్న మరికొన్ని ఆహార పదార్థాలతో చిన్నారి ఆకలి తీర్చుకుంది. అలాగే తల్లి నోట్లో కూడా కొన్ని కనిపించాయి. ఆ పదార్థాలను ఆ చిన్నారి తల్లి నోట్లో పెట్టింది. విషయం తెలుసుకున్న పోలీసులు చుట్టుపక్కల వారిని ఆరా తీయగా మూడు రోజుల క్రితం ఈ ఇంటి టీవీ సౌండ్ ఒక్కసారిగా పెద్దగా వచ్చిందని కొందరు చెప్పారు. ఇక పోస్ట్ మార్టం వివరాల ప్రకారం ఊపిరాడనివ్వకుండా మహిళను చంపారని తెలిసింది. ఇంకా నిందితులు దొరకలేదు. ఇక పాపను వారి సంరక్షణలో ఉంచుకున్న పోలీసులు వారి వివరాలను గోప్యంగా ఉంచారు.