టైమ్స్ స‌ర్వే : మ‌ళ్లీ మోడీ వ‌స్తే భ‌స్మ‌మే!!

Saturday, November 3rd, 2018, 08:49:51 PM IST

దేశ కీల‌క వ్య‌వ‌స్థ‌ల్ని నిర్వీర్యం చేస్తూ సామాన్య జ‌నాల్ని భ‌య‌భ్రాంతుల‌కు గురిచేస్తున్న ప్ర‌దాని న‌రేంద్ర మోదీ మ‌ళ్లీ అధికారం చేప‌డితే దేశం అధోగ‌తిపాలు కావాల్సిందేనా? అంటే అవుననేది ఓ వ‌ర్గం ఆందోళ‌న‌. ఆయ‌న మ‌ళ్లీ ప్ర‌ధాని అయితే దేశాన్ని భ‌స్మం చేసేస్తార‌ని విప‌క్షాలు ఆందోళ‌న చెందుతున్నాయి. అయితే తాజాగా డైలీ హంట్, టైమ్స్ నౌ నిర్వ‌హించిన స‌ర్వే వారికి షాక్ తెప్పించే విధంగా వుంది. ఈ సంస్థ‌లు నిర్వ‌హించిన వ్య‌క్తిగ‌త స‌ర్వేలో మ‌ళ్లీ కేంద్రంలో అధికార పీఠాన్ని న‌రేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ చేజిక్కించుకునే అవ‌కాశాలే ఎక్కువ‌గా వున్నాయని తేల‌డం విప‌క్షాల్ని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది.

స‌రిగ్గా రెండు రోజుల క్రితం టైమ్స్ నౌ ఓ స‌ర్వేను నిర్వ‌హించింది. ఇందులో మ‌ళ్లీ మోడీ అధికారాన్ని చేప‌ట్ట‌డం ఖాయం అని తేలింది. ఇటీవ‌ల మోదీ అవ‌లంభించిన నోట్ల ర‌ద్దు, ఇత‌ర‌త్రా ప్ర‌జా వ్య‌తిరేక విధానాల వ‌ల్ల బీజేపీ దాని మిత్ర ప‌క్షాల‌కు భారీ స్థాయిలో సీట్లు త‌గ్గినా అధికారం చేప‌ట్ట‌డానికి గ‌ల మ్యాజిక్ ఫిగ‌ర్‌ను మాత్రం ఎన్డీఏ సొంతం చేసుకుంటుంద‌ని తేల్చిచెప్పింది. ఈ వార్త ప్ర‌తి ప‌క్షాల గుండెల్లో అణుబాంబుగా మారింది. తాజాగా టైమ్స్ నౌ ఓ స‌ర్వేను స‌మ‌ర్ధిస్తూ డైలీ హంట్ నిర్వ‌హించిన స‌ర్వే ఫ‌లితాలు వ‌చ్చాయి.

మ‌రోసారి మోడీనే ప్ర‌ధాని కావాల‌ని అర‌వై మూడు శాతం మంది ప్ర‌జ‌లు కోరుకోగా, రాహుల్ గాంధీని కేవ‌లం 17 శాతం మంది మాత్ర‌మే కోరుకోవ‌డం గ‌మ‌నార్హం. ఇక అర‌వింద్ కేజ్రివాల్‌ని ఎనిమిది శాతం మంది మాత్ర‌మే కోరుకున్నారు. ఈ ఫ‌లితాల్సి విశ్లేషించిన రాజ‌కీయ విశ్లేష‌కులు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించ‌డం ఆస‌క్తిని పంచుతోంది. మోదీపై వ్య‌తిరేక‌త వున్నా అత‌ని త‌ర‌హాలో దేశానికి కావాల్సిన నాయ‌కుడు ప్ర‌తి ప‌క్షాల్లో లేక‌పోవ‌డ‌మే ఇందుకు కార‌ణంగా తేల్చి చెప్పారు. అయితే తాజా స‌ర్వేల్లో వున్న నిజ‌మెంత అన్న‌ది మాత్రం అనుమాన‌మే. ఎంత మందిని స‌ర్వేచేశారు? నిస్పక్ష‌పాతంగానే స‌ర్వేని నిర్వ‌హించారా? అన్న‌దానిపై ప‌లు అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.