ఆకట్టుకున్న టాలివుడ్ క్రికెట్ కప్

Sunday, December 14th, 2014, 06:30:32 PM IST

హుధూద్ బాధితుల సహాయార్ధం టాలివుడ్ నటులు విజయవాడలో నిర్వహించిన టాలివుడ్ క్రికెట్ కప్ ఆకట్టుకున్నది. టాలివుడ్ నటులు శ్రీకాంత్ జట్టు… తరుణ్ జట్టుగా విడిపోయి మ్యాచ్ ఆడారు. కాగ.. తరుణ్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నది. ఇక మొదట బ్యాటింగ్ కు దిగిన శ్రీకాంత్ జట్టు 19.2 ఓవర్లలో 199 పరగులు చేసింది. అనతరం బ్యాటింగ్ కు తరుణ్ జట్టు 20 ఓవర్లలో కేవలం 160 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో శ్రీకాంత్ జట్టు తరుణ్ జట్టుపై 39పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఇక ఈ కార్యక్రమం ద్వారా సేకరించిన 70లక్షల రూపాయల మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేశారు. ప్రేక్షకులకు బోరు పుట్టకుండా మధ్యమధ్యలో టాలివుడ్ నటీమణుల నృత్యాలతో అలరించారు.