విజయవాడలో స్టార్స్ క్రికెట్ సందడి !

Sunday, December 14th, 2014, 10:49:52 AM IST


అక్టోబర్ 12న హుధూద్ తుఫాను కారణంగా ఉత్తర కోస్తా జిల్లాలోని నాలుగు జిల్లాలు అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా విశాఖ నగరం తన అందాలను కోల్పోయి… కళావిహీనంగా మారిపోయింది. ఇక తుఫాను బాదితులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకున్నది. హుధూద్ బాదితులను ఆదుకోవడం కోసం మేము సైతం అనే కార్యక్రమాన్ని నిర్వహించి దాదాపు 11కోట్ల రూపాయలకు పైగా సహాయాన్ని ముఖ్యమంత్రి సహాయన నిధికి అందజేసింది.

ఇక హుధూద్ బాధితులను ఆదుకోవడానికి విజయవాడలో ఈ రోజు టాలివుడ్ స్టార్స్ క్రికెట్ కప్ పోటీలను నిర్వహిస్తున్నది. టాలివుడ్ కు చెందిన ప్రముఖ నటులు ఈ క్రికెట్ మ్యాచ్ లో పాల్గొంటున్నారు. విజయవాడలోని ఇందిరా గాంధి స్టేడియం అభిమానులులో నిండిపోయింది. స్టార్స్ క్రికెట్ మ్యాచ్ లను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు. తరుణ్.. శ్రీకాంత్ టీంల మధ్య క్రికెట్ మ్యాచ్ మరి కాసేపట్లో ప్రారంభం కానున్నది.

వీడియో కోసం క్లిక్ చేయండి