ఎల్లుండి ఫలక్ నామాలో విందు

Thursday, September 18th, 2014, 12:31:02 AM IST


14వ ఆర్ధిక సంఘం అధికారులు రేపు సాయంత్రం హైదరాబాద్ రానున్నారు.. ప్రణాళిక సంఘం అధికారులతో ముఖ్యమంత్రి కెసిఆర్ ఎల్లుండి చర్చలు జరుపుతారు.. అనంతరం ప్రణాళిక సంఘం అధికారులకు అదేరోజు ఫలక్ నామా ప్యాలెస్ లో ముఖ్యమంత్రి విందు ఇవ్వనున్నారు. ఆర్ధిక సంఘం చైర్మన్ మరియు సభ్యులకు రేపు రాత్రి తెలంగాణ గవర్నర్ నరసింహన్ రాజ్ భవన్ లో విందు ఇవ్వనున్నట్టు సమాచారం.

అయితే, ఆర్ధిక సంఘం ముందు ఉంచాల్సిన ప్రతిపాదనలు గురించి కెసిఆర్ వివిధ శాఖల ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు.