నరమాంస భక్షులున్నారు జాగ్రత్త!

Saturday, November 15th, 2014, 11:07:13 AM IST


సహజంగా నరమాంస భక్షకులు ఎక్కడో కీకారణ్యాలలో ఉంటారని వింటూ ఉంటాం. అయితే ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటనను వింటే కీకారణ్యాలలో కాదు జనారణ్యాలలో కూడా అంతకంటే భయంకరులు ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే విషయాన్ని వాషింగ్టన్ పోస్ట్ తాజాగా ప్రచురించింది. వారి కథనం ప్రకారం బ్రెజిల్ లో ఒక మగ, ఇద్దరు ఆడవారు ఉండే ముగ్గురు సభ్యులతో కూడిన ఒక కుటుంబం మనుషులను చంపి వారిని తినేవారని తెలుస్తోంది. అయితే వీరి బాగోతం బయట పడడంతో 2012లో ఈ ముగ్గురిని అరెస్ట్ చేశారు. కాగా వీరు తమ ఇంట్లో పిల్లలను చూసుకునే ‘నాని’ ఉద్యోగం ఉందని మభ్యపెట్టి ఇద్దరు మహిళలను చంపి వారి శరీర భాగాలతో ‘ఎంపడా పేస్ట్రీ’లను చేసుకుని తినేవారని తెలుస్తోంది. అంతే కాకుండా వారితో నివసించే చిన్నారికి కూడా పెట్టి మిగిలినవి చుట్టుపక్కల వారికి విక్రయించేవారట.

ఇక క్రితం నెలలో ఒక ఆస్ట్రేలియన్ చెఫ్ కూడా ఈ నరమాంస భక్షణ కేసులో పట్టుబడ్డాడు. కాగా 27ఏళ్ళ ఈ చెఫ్ తన గర్ల్ ఫ్రెండ్ ను చంపి ఆమె శరీర భాగాలను వండి తిని, పోలీసుల నుండి తప్పించుకుని పారిపోయే ప్రయత్నంలో ప్రాణాలను కోల్పోయినట్లు తెలుస్తోంది. దీనిని బట్టి నరమాంస భక్షులు ఎక్కడో లేరు మన చుట్టుపక్కలే ఉన్నారని రుజువులతో సహా నిర్ధారణ అయ్యింది. కాబట్టి వారినుండి తప్పించుకోవడానికి సాధ్యమనైనంత వరకు జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత మనమీదే ఉంది.