ఉత్తమ్ కుమార్ రెడ్డికి దిమ్మతిరిగిపోయే కౌంటర్ ఇచ్చిన తెరాస నేత..!

Thursday, November 1st, 2018, 02:43:17 AM IST

తెలంగాణలోని మహా కూటమి పేరిట టీకాంగ్రెస్ మరియు తెలుగుదేశం పార్టీలు కలిసి ఎన్నికల బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే.అయితే ఎన్నికలు దగ్గర పడుతున్నాయి అంటే ఒక పార్టీ నేతల మీద మరో పార్టీ నేతలు మీద విమర్శలు గుప్పిస్తుంటారు.అదే విధంగా టీకాంగ్రెస్ పార్టీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తెరాస ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసిఆర్ పై చేసినటువంటి విమర్శలపై ఇప్పుడు తెరాస నేతల దగ్గర నవ్వులు పాలవుతున్నారు.కెసిఆర్ నరేంద్ర మోడీని కలవాడని వెళ్లి ఎదో రహస్య మీటింగ్ పెట్టుకుంటారని ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిన మాటలకు గాను తెరాస నేత వినోద్ కుమార్ దిమ్మ తిరిగిపోయే కౌంటర్ ఇచ్చారు.

కెసిఆర్ ఏదో తన కంటి చూపు సమస్యను చూపించుకోవడానికి ఢిల్లీ వెళ్తే దాన్ని ఇక్కడ నేతలు మోడీతో మాట్లాడటానికి వెళ్లారని అసలు ఎలా అనుకుంటున్నారని మండిపడ్డారు.అయినా నరేంద్ర మోడీ ఇప్పుడు ఎక్కడో జపాన్ దేశం లో ఉంటే ఢిల్లీలో కెసిఆర్ మోడీని ఎలా కలుసుకుంటారని ఎద్దేవా చేశారు.ఇంత అవగాహన కూడా లేకుండా ఉత్తమ్ ఎలా మాట్లాడుతున్నారో అని వినోద్ అక్కడే నవ్వుకున్నారు.అప్పుడు తెలంగాణా సాధన కొరకు ఎక్కువ సమయం ఢిల్లీలో ఎక్కువ సమయం గడపడం వలన అక్కడ వచ్చినటువంటి కంటి సమస్యను అక్కడే చూపించుకోవడం జరిగిందని ఇప్పుడు కూడా అదే ఆసుపత్రికి అందుకే వెళ్లారని వివరణ ఇచ్చారు.