హెచ్-1బీ వీసాల్లో సమూల మార్పులు.. ట్రంప్ అడ్మినిస్టేషన్ కీల‌క‌ నిర్ణయం..!

Saturday, December 1st, 2018, 11:53:33 AM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సారథ్యంలోని ప్రభుత్వం.. గతంలో ఎన్నడూ లేని విధంగా హెచ్‌ 1బీ వీసా విధానంలో మార్పులు తీసుకొచ్చేందుకు ప్రతిపాదనలు తయారు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. వ‌చ్చే ఏడాది నాటికి హెచ్‌ 1బీ వీసా విధానంలో మార్పులు తీసుకొచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తుండ‌డంతో.. దీని ప్ర‌భావం యూఎస్‌లోని భారీతీయ ఐటీ కంపెనీలు, చిన్న‌, మ‌ధ్య‌త‌ర‌హా కంపెనీల‌పై ఎక్కువ‌గా ప‌డ‌నుంది.

ఇక అసలు మ్యాట‌ర్‌లోకి వ‌స్తే.. అమెరికాలో తాత్కాలికంగా ఉద్యోగం చేయడానికి విదేశీయులకు జారీ చేసే అనుమతి పత్రమే హెచ్-1బీ వీసా. ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన వారికి వీటిని జారీ చేస్తారు. సాదార‌ణంగా ఏడాదికి 65,000 వీసాలు జారీ చేస్తారు. వీటిని జనరల్ కోటా అని చెప్పుకోవచ్చు. అంటే ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే అమెరికాలో మాస్టర్స్ చేసే వారికి ఏడాదికి 20,000 వీసాలు ఇస్తారు. ఈ క్ర‌మంలో అమెరికాలో మాస్టర్స్‌ డిగ్రీ లేదా అంతకన్నా ఎక్కువ విద్యార్హతలు ఉన్న 20వేల దరఖాస్తులను ఈ పరిమితి నుంచి మినహాయిస్తారని ట్రంప్ అడ్మినిస్టేష‌న్ స్పంష్టం చేసింది.

ఈ నేప‌ధ్యంలో ఒక్కో సీజన్‌లోనే 1.9లక్షల హెచ్‌-1బీ దరఖాస్తులు అందాయి. ఇందులో 60శాతానికి పైగా భారతీయులవే కావడం గమనార్హం. దీంతో హెచ్-1బీ వీసాలకు డిమాండు బాగా ఉండ‌డంతో… కోటాకు మించి దరఖాస్తులు వస్తే లాటరీ విధానంలో వీసాలు కేటాయిస్తారు. అయితే అమెరికా ప్ర‌భుత్వం ఇప్పుడు హెచ్‌-1బీ వీసాల విషయంలో మరింత కఠినంగా వ్యవహరించనుంది. లాట‌రీ విధానానికి స్వ‌స్తి ప‌లికి, ప్ర‌తిభ ఆధారంగా హెచ్‌-1బీ వీసాలను ఇస్తే.. ఎంతో మంది ప్ర‌తిభ ఉన్న‌వారు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని యూఎస్‌ సిటిజన్‌షిప్ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీస్‌(యూఎస్‌సీఐఎస్‌) భావిస్తోంది.

ఈ క్ర‌మంలో ముందస్తు నమోదు ప్రక్రియను తప్పనిసరి చేసే ఆలోచ‌న‌లో ఉంది యూయ‌స్ ప్ర‌భుత్వ‌. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు లాట‌రీలో ప్రవేశాలు పొందడానికి తగిన ఆధారాలుంటే సరిపోయేవి.. అయితే ప్రస్తుతం ప్రవేశపెడుతున్న ఈ నూతన విధానం వల్ల హెచ్‌-1బీ వీసా ప్రక్రియ విస్తృతం కానుంది. ఇక ఈ నూతన విధానానికి అమెరికా అధికార కార్యాలయం నుంచి అనుమతులు లభించాయి. యూఎస్‌సీఐఎస్‌ ప్రవేశపెడుతున్న ఈ సరికొత్త విధానం వల్ల అమెరికాలో ఉద్యోగం చేయాలనుకున్న వారికి కాస్త కష్టకాలం ఎదురుకానుందని స‌ర్వ‌త్రా చ‌ర్చించుకుంటున్నారు.