ట్రంప్ – ఇమ్రాన్ ఖాన్ ల ట్విట్టర్ వార్..!

Tuesday, November 20th, 2018, 12:17:45 PM IST

పాకిస్తాన్ కు మద్దతు ఉపసంహరిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సమర్ధించుకున్నాడు. మేము ఎంత సాయం చేసిన వారు తిరిగి కొంచెం కూడా చేయట్లేదని ఆరోపించారు. పాకిస్తాన్ లో లాడెన్ ఉనికిని ఉదాహరణగా చూపిస్తూ ట్రంప్ పాకిస్తాన్ పై ఆరోపణలు చేసారు. ఆదివారం ప్రసారమైన ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ మేరకు స్పందించారు. ఈ వ్యాఖ్యలకు స్పందనగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోమవారం నాడు ట్విట్టర్ వేదికగా ట్రంప్ కు తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు, ట్రంప్ కు చారిత్రాత్మక వాస్తవాల గురించి తెలియాల్సి ఉంది అంటూ ట్వీట్ చేసాడు.

ఆ తర్వాత ఇద్దరి మధ్య ట్వీట్ల పరంపర కొనసాగింది, ” టెర్రరిజం పై యూఎస్ చేసిన యుద్ధంలో పాకిస్తాన్ 75000 మందిని, 123 బిలియన్ డాల్లర్లకు పైగా సంపాదను కోల్పోతే, అమెరికా చేసిన 20 బిలియన్ డాలర్ల సాయం అణువంత అని పేర్కొన్నారు. అదే సమయంలో అమెరికన్ దలాలకు పాకిస్తాన్ సరఫరా మార్గాలను అందిస్తున్న అంశాన్ని గుర్తు చేస్తూ, ” మిస్టర్ ట్రంప్ అలాంటి త్యాగాలు చేసిన మరో మిత్ర దేశం ఉందా?” అంటూ ప్రశ్నించారు. ఇమ్రాన్ ట్వీట్ కు స్పందించిన ట్రంప్ “అమెరికా నుండి సాయం పొందిన అనేక దేశాల్లో పాకిస్తాన్ ఒకటని, చెప్పినప్పటికీ తిరిగి చెల్లించలేదు” అన్నారు. అమెరికా, పాకిస్తాన్ మధ్య సంబందాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి, ట్రంప్ అధికారంలోకి వచ్చాక అవి ఇంకా పల్చబడ్డాయి. తీవ్రవాదాన్ని అదుపు చేయటంలో వైఫల్యం చెందిందని సాకు చూపిస్తూ పాకిస్తాన్ కులం మిలిటరీ దళాల మద్దతు ఉపసంహరించుకుంది ట్రంప్ ప్రభుత్వం.