నచ్చితే అమెరికాకు ఆహ్వానిస్తా.. కిమ్ పై ట్రంప్ కామెంట్స్!

Saturday, June 9th, 2018, 01:04:01 AM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ఎలా ఉంటాడో ఎవ్వరికి తెలియదు. ఒక మంచి మాట అన్నాడు అనే లోపే మారో కాంట్రవర్షియల్ కామెంట్ తో రచ్చ చేస్తుంటాడు. ఇటీవల కాలంలో ఆయన చాలా వరకు పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ఓర్పుతో ఉన్నాడని కూడా అయన ప్రవర్తనను చూస్తుంటే అర్ధమవుతోంది. ఇక ఆయనకంటే వినూత్న శైలిలో కనిపించే వ్యక్తి ఉత్తర కొరియా అధ్యక్షుడు. అనుమానం వస్తే చాలు అణు పరీక్షలు చేసి హెచ్చరికలు పంపడం కిమ్ కిమ్ జాంగ్ ఉన్ కు అలవాటే.

గతంలో పచ్చగడ్డి వేస్తె భగ్గుమనే వైరంతో ఉన్న ఈ ఇద్దరు ఇప్పుడు పాజిటివ్ కామెంట్స్ చేసుకోవడం ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయ్యింది. ఉత్త్తర కొరియా – అమెరికాల మధ్య వైరం గత కొన్నేళ్లుగా వారసత్వంలా వస్తున్నదే. అమెరికా పెత్తనం చెలాయిస్తోంది అని ఉత్తర కొరియా కోపానికి వచ్చి మారణాయుధాలను ప్రదర్శించడం కామన్ అయిపొయింది. ఇకపోతే వీరి మధ్య వైరాన్ని తగ్గించడానికి ఐక్యరాజ్య సమితి చాలా ప్రయత్నాలు చేస్తోంది. ఎవరు ఊహించని విధంగా సింగపూర్ లో జరగున్న సమావేషంలో ఇద్దరు అధ్యక్షులు ఎదురుపడనున్నారు. ఈ మీటింగ్ నచ్చితే కిమ్ ను అమెరికాకు ఆహ్వానిస్తానని ట్రంప్ తెలిపాడు. ఒకవేల కిమ్ గిట్టనట్లు మాట్లాడితే మధ్యలో లేచి వెళ్ళిపోతా అని ట్రంప్ తెలుపుతూ.. ఉత్తర కొరియా మంచి కోసం కిమ్ మంచి పని చేయాలని అనుకంటున్నారని భావిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు వివరించాడు.