ఈబీ-5 వీసాల రద్దు దిశగా ట్రంప్ ప్రభుత్వం?

Sunday, June 24th, 2018, 11:05:16 AM IST

అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షులు ట్రంప్ చేపడుతున్న సంస్కరణలు, విధానాలు కేవలం ఆ దేశస్థులకు మాత్రమే మేలు చేకూర్చేలా వుండనున్నాయి. అలానే అయన అవలంబిస్తున్న నియంతృత్వ పోకడల వల్ల ఇతర దేశస్థులు పలు ఇబ్బందుల పాలవుతున్నారు. ఇటీవల హెచ్-4 వీసా దారుల భాగస్వాముల ఉద్యోగ రద్దు దిశగా అడుగులు వేస్తున్న ట్రంప్ ప్రభుత్వం ప్రస్తుతం మరొక షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగ కల్పన, పెట్టుబడుల ద్వారా దేశ ఆర్ధిక వ్యవస్థకు కొంత మేలు జరుగుతుందనే ఉద్దేశంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 1990లో ఈబీ-5 వీసాలను ప్రవేశ పెట్టడం జరిగింది. అయితే క్రమేణా రాను రానూ, ఈ తరహా వీసాల ద్వారా వచ్చిన వారు మనీ లాండరింగ్, రహస్య గూఢ చర్యానికి పాల్పడం, పలు రకాలుగా మోసాలకు పాల్పడడం వంటి పనులు చేస్తూ వాటిని దుర్వినియోగం చేస్తున్నారని మొదటి నుండి అమెరికన్ సీనియర్ చట్ట సభ్యులు ఈ తరహా వీసాలను వ్యతిరేకిస్తున్నందువల్ల త్వరలో వీటిని అతి తక్కువకు పరిమితం చేయడం లేదా పూర్తిగా తొలగించే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు అమెరికన్ కాన్సులెట్ ద్వారా సమాచారం అందుతోంది.

వాస్తవానికి అమెరికాలో గ్రీన్ కార్డు ఇచ్చే ఈ వీసా నిబంధలు ప్రకారం అక్కడి కరెన్సీ 10 లక్షల డాలర్లు అంటే మన దేశ కరెన్సీ ప్రకారం రూ.6.78 కోట్లు అమెరికాలో పెట్టుపడులు పెట్టి తద్వారా 10మందికి శాశ్వత ఉద్యోగ అవకాశం ఇవ్వడం ద్వారా గ్రీన్ కార్డు జరీ చేయడం జరుగుతుంది. ఈ విధానంలో ఏటా అమెరికన్ ప్రభుత్వం దాదాపు 10 వేల మంది విదేశీయులకు జరీ చేస్తోంది. అందులో చైనా మరియు వియాత్నం లు మొదటి రెండు స్థానాల్లో ఉండగా మన దేశం మూడవ స్థానం లో వుంది. అయితే ఒక్కోదేశానికి పరిమితి 7శాతం గా వుంది. దీని ప్రకారం గరిష్టం ఈ రకమైన వీసాల తిరస్కరణ రేటు కేవలం 20శాతం మాత్రమే ఉంటోందట. కాగా గత సంవత్సరం ఈ ఈబీ-5 కింద 500 వీసాలు దాఖాస్తు చేసుకోగా, ఈ సరి అవి 700కు పైగా చేరుకున్నాయట. భారత్ నుండి ఈ రకమైన వీసాలు పొందే వారిలో ఎక్కువగా చండీగఢ్, తమిళనాడు, పంజాబ్, ఢిల్లీ, కర్ణాటక నుండే పెట్టుబడిదారులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ రకమైన వీసాలను తొలగించడం వల్ల చైనా సహా భారత్ కు కూడా నష్టమేనని తెలుస్తోంది……