తెలంగాణాలో టీడీపీకి షాక్..ప్రముఖ టీడీపీ ఇంచార్జ్ అరెస్ట్..తెరాస హస్తం.?

Saturday, November 3rd, 2018, 09:42:44 PM IST

తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్టీల మధ్య ఎన్నికల వేడి ఏ రేంజ్ లో ఉందొ వేరే చెప్పక్కర్లేదు.తెలుగుదేశం మరియు టీకాంగ్రెస్ పార్టీలు కలిసి అక్కడ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారన్న సంగతి తెలిసినదే.అయితే గత కొద్ది రోజుల క్రితం టీకాంగ్రెస్ నేత అయినటువంటి రేవంత్ రెడ్డి ఇంటి పై అకస్మాత్తు ఐటీ దాడులు కలకలం రేపాయి.అయితే ఆ దాడులను కెసిఆర్ మోడీతో చేయించాడని టీకాంగ్రెస్ నేతలు ఆరోపించారు.ఇప్పుడు కూడా తాజాగా టీ తెలుగుదేశం కి సంబందించిన మల్కాజ్ గిరి ఇంఛార్జ్ రామకృష్ణ యాదవ్ ని అకస్మాత్తుగా పోలీసులు వచ్చి అరెస్ట్ చెయ్యడం ఆశ్చర్యం కలిగించింది.

దీనికి గల కారణం ఆ మధ్య బోనాల పండుగ రోజున విధి నిర్వహణలో ఉన్నటువంటి పోలీసులను అడ్డుకున్నందుకు గాను ఈ రోజు అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది.ఆయన స్వగృహంలో ఉండగానే పోలీసులు వచ్చి అసలు ముందస్తు నోటీసులు కూడా ఏం పంపకుండా అరెస్ట్ చెయ్యడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.అయినా సరే వారు వినకుండా ఆయన్ని పోలీసులు తీసుకెళ్లిపోయారు.అయితే ఈ చర్య వెనుక కూడా తెరాస హస్తం ఉందని, ఇదంతా రాజకీయ కక్ష సాధింపు చర్యే అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.అప్పుడు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మీద దాడులు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి చెందిన నేత మీద ఏ నోటీసులు లేకుండా అరెస్ట్ చెయ్యడం ఇవన్నీ పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.