బుల్లితెర నటిది ఆత్మహత్యే!

Monday, February 16th, 2015, 10:36:58 AM IST


బుల్లితెర నటీమణి దీప్తి అలియాస్ రామలక్ష్మి ఇటీవల హైదరాబాద్ ఫతేనగర్ లోని ఠాకూర్ ఆర్ డీ కాంప్లెక్స్ లోని తన ఫ్లాట్ లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన తెలిసిందే. కాగా ఆమెది ఆత్మహత్యేనని పోస్ట్ మార్టం చేసిన గాంధీ ఆసుపత్రి వైద్యులు ప్రాధమిక దర్యాప్తులో తేల్చి చెప్పారు. కాగా దీప్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు వైద్యులు పోస్ట్ మారటం రిపోర్ట్ లో పేర్కొన్నారు. అయితే ఆమె ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.

కాగా వారం రోజుల కిందట తన తల్లితండ్రులకు ఫోన్ చేసిన దీప్తి తాను హైదరాబాద్ లో ఉండలేక పోతున్నానని, ఇంటికి వచ్చేస్తానని తెలిపినట్లు సమాచారం. అయితే దీప్తి చనిపోయే ముందు వరకు ల్యాప్ టాప్ వినియోగించినట్లుగా తెలుస్తోంది. ఇక పాస్ వర్డ్ నేపధ్యంగా ఆమె ల్యాప్ టాప్ ఓపెన్ చెయ్యలేక పోవడంతో, దీనిని ఓపెన్ చేస్తే మరింత సమాచారం తెలిసే అవకాశాలు ఉంటాయని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.