మలుపులు తిరుగుతున్న పతన్ కేసు

Sunday, September 21st, 2014, 09:56:51 AM IST


అర్మీ అధికారి పతన్ కూమార్ కేసులో మరో కొత్త కోణాలు బయటపడుతూనే వున్నాయి.గత కొంత కాలంగా పతన్ ను విచారిస్తున్న ఆర్మీ అధికారుల విచారణలో అనుష్కా అగర్వాల్ స్థానంలో కథ నడిపించిన మహిళ పాక్ ప్రభుత్వ ఇంటర్ సర్వీ సెస్ ఇంటలీజెన్సు (ఐఎస్ఐ) చెందిన అధికారిణి ఉన్నట్లు అర్మీఅధికారుల విచారణలో తెలిసింది. దీంతో దేశానికి చెందిన రహస్యాలు అన్ని లీక్ కావడంతో అధికారులకు మైండ్ బ్లాక్ అవుతోంది.

అనుష్కా అగర్వాల్ పేరుతో దేశ రహస్యలను చేప్పిన పతన్ కూమార్ సీసీయస్ పోలీసుల విచారణలో అన్ని విషయాలు చేప్పడంతో లోతుగా విచారణ చేసిన పోలీసులకు ఉత్తర ప్రదేశ్ లోని మీరాట్ యూనిట్ లో పని చేస్తున్న ఆసిఫ్ అలీగా పోలీసులు గుర్తించి అదుపులోకి తిసుకున్నారు… పతాన్ కూమార్ విచారణ లో కథ నడిపిన వ్యక్తీ ఐఎస్ఐలో పని చేస్తున్న అధికారణి అని తెలింది.. దీంతో సైనికాధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.

ఇప్పటికి చంచల్ గూడ జైలు లో ఉన్న పతాన్ ను ఆర్మీ అధికారుల విచారణ లో వెలుగు చూస్తున్న వాస్తవాలకు నివ్వెర పోతున్నారు.. ఐఎస్ ఐ లో పని చేస్తున్న మహిళ అధికారణే కథ అంతా నడిపినట్లు విచారణలో తెలిసింది.. అమెతో చేసిన చాటింగ్ కోంప ముంచినట్లు పోలీసుల విచారణలో తెలింది.. అనుష్కా బ్రౌజింగ్ హ్యాకింగ్ ద్వారా కంప్యూటర్ హార్డ్ డెస్క్ లో ఉన్న మిలటరికి చెందిన సమాచారాన్ని తస్కరించినట్లు తెలిసింది. ఇండియా సిమ్ కార్డులను ఉపయోగించిన అనుష్కా పాక్, భారత్ సరిహద్దుల్లోకి వచ్చి మాట్లాడినట్లు పోలీసుల విచారణ లో తెలిసింది.

అనుష్కా పేరుతో ఐఎస్ఐ మహిళ అధికారణి నాటకం అడినట్లు విచారణలో వాప్తవాలు వెలుగు చూస్తున్నాయి. కంప్యూటర్ ద్యారా హ్యాకింగ్ చేసి భారత రహస్యలను పాక్ రాబట్టడాన్ని సైనికులు జీర్ణించుకోవడం లేదు. అప్రమత్తమైన అర్మీ అధికారులు కంప్యూటర్లకు లాక్ నంబర్ల ఏర్పాటు చేసుకోవలని అదేశాలు జారీ చేశారు. పతాన్ అర్మీ ఉన్నతాధికారుల సమాచారాన్ని రాబట్టడం కోసం కంప్యూటర్లను ఎవరెవరిని ఉపయోగించాడు అన్న కోణంలో తెలుసుకుంటున్నారు.