నేటిఏపి స్పెషల్ : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, అన్న ఎన్టీఆర్ గురించిన పదిసత్యాలు

Sunday, May 8th, 2016, 06:25:59 PM IST


గుంటూరులోని ఓ కాలేజీలో బిఏ చదివిన ఓ విద్యార్ధి సినిమాలపై ఆసక్తితో చెన్నై వెళ్లి.. టాప్ యాక్టర్ గా అవతరించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా, తెలుగువారి ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలల కాలంలోనే తెలుగుదేశం పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే విధంగా కృషి చేశారు ఎన్టీఆర్. మరి అటువంటి ఎన్టీఆర్ గురించిన పది సత్యాలను ఇప్పుడు తెలుసుకుందాం.

1. 1983లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్టీఆర్ లోక్ పాల్ బిల్లును ప్రవేశపెట్టారు.
2. మగపిల్లలతో సమానంగా ఆస్తిలో ఆడపిల్లలకు కూడా వాటా ఇవ్వాలనే చట్టాన్ని తీసుకొచ్చిన వ్యక్తీ ఎన్టీఆర్.
3. కేంద్రం తీసుకునే మంచి నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని చెప్పిన ఎన్టీఆర్ చెప్పినట్టుగానే, స్ట్రాంగ్ స్టేట్స్, స్ట్రాంగ్ సెంట్రల్ కు మద్దతు పలికారు.
4. ఆంధ్రప్రదేశ్ లో సంపూర్ణ మద్యపాన నిషేధం విధించిన తొలిముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ఖ్యాతిగాంచారు.
5. ఇక్కడ చదువుకొని విదేశాలలో వైద్యం చేస్తున్న విధ్యులను తిరిగి స్వదేశం వచ్చి సేవచేయాలని పిలుపునిచ్చిన వ్యక్తి ఎన్టీఅర్ కావడం విశేషం.
6. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ట్యాంక్ బండ్, బుద్దవిగ్రహం ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది.
7. 1923 మే 28 వ తేదీన గుడివాడ మండలంలోని నిమ్మకూరులో జన్మించిన ఎన్టీఆర్, విజయవాడ, గుంటూరులో చదువుకున్నారు. ఆ తరువాత మద్రాస్ సర్వీస్ కమిషన్లో సబ్ రిజిస్త్రార్ ఉద్యోగం సంపాదించారు.
8. 1949 లో వచ్చిన మనదేశం అనే సినిమాలో పోలీస్ క్యారెక్టర్ వేసిన ఎన్టీఆర్.. 1951 లో వచ్చిన పాతాళభైరవి సినిమాతో హీరోగా మారిపోయారు. అక్కడి నుంచి వరసగా సినిమాలు చేస్తూ మకుటంలేని మహారాజుగా తెలుగుసినిమా ఇండస్ట్రీని ఏలారు.
9. 1943 లో అంటే ఎన్టీఆర్ కు 20 సంవత్సరాల వయసు ఉండగా బసవతారం ను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఏడుగురు మగపిల్లలు, నలుగురు ఆడపిల్లలు ఉన్నారు. ఇందులో హరికృష్ణ, బాలకృష్ణ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే పురందీశ్వరి, భువనేశ్వరిదేవీ లు కూడా ఫేమస్ అయ్యారు.
10. దాదాపు 300 పైచిలుకు చిత్రాలలో నటించిన ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్ కు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1996 జనవరి 18 వ తేదీన ఆయన స్వర్గస్తులైనారు.