నేటిఏపి స్పెషల్ : బాలీవుడ్ ఎరోటిక్ స్టార్ సన్నిలియోన్ గురించి మీకు తెలుసా..?

Wednesday, February 24th, 2016, 06:30:05 AM IST


34 సంవత్సరాల వయసులో కూడా సన్నిలియోన్ తన అందంతో అందర్నీ ఆకట్టుకుంటున్నది. గతంలో అడల్ట్ సినిమాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తరువాత బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అటు ఉత్తరాది భాషా చిత్రాలలోనే కాకుండా.. ఇటు దక్షిణాది చిత్రాలలో అడపాదడపా కనిపిస్తూ.. తన ఉనికిని చాటుకుంటున్నది సన్నీ. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే.. మరోవైపు 300 మంది పిల్లలున్న ఓ స్కూల్ ను దత్తత తీసుకొని కావాల్సిన సౌకర్యాలను సమకూరుస్తున్నది. ఇంకోవైపు చెన్నై స్వాగర్ అనే క్రికెట్ జట్టును కొనుగోలు చేసి క్రీడా వ్యాపారరంగంలోకి కూడా అడుగుపెట్టింది సన్నీలియోన్. సన్నీలియోన్ గురించి తెలియని కొన్ని నిజాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

* సిక్కు ఫ్యామిలీ నుంచి వచ్చిన సన్నిలియోన్ చిన్నతనంలో ఓ క్యాథలిక్ స్కూల్ లో చదువుకున్నది.
* సన్నిలియోన్ 15 సంవత్సరాల వయసులో జర్మన్ బెకరిలో వర్క్ చేసింది.
* చిన్న పిల్లల నర్స్ కోర్స్ చేస్తున్న సమయంలో జె అలెన్ అనే ఫోటోగ్రాఫర్ ద్వారా సన్నిలియోన్ కు పెంట్ హౌస్ మ్యాగజైన్ కవర్ పేజ్ కు ఫోటోలు ఇచ్చే అవకాశం దక్కింది.
* 2004లో సన్నిలియోన్ ది గర్ల్స్ నెక్స్ట్ డోర్ అనే షో లో గెస్ట్ రోల్ ప్లే చేసింది.
* 2005 లో ఎంటివి అవార్డ్ కార్యక్రమంలో రెడ్ కార్పెట్ పై నడిచి సంచలం సృష్టించింది.
* పెంట్ హౌస్ పెట్ మ్యాగజైన్ కవర్ పేజ్ కు ఫోజులు ఇచ్చిన మొదటి ఇండియన్ స్టార్ సన్నిలియోన్ కావడం విశేషం
* అడల్ట్ స్టార్ నుంచి బాలీవుడ్ స్టార్ గా వచ్చి సక్సెస్ సాధించిన మొదటి నటి కూడా సన్నిలియోన్ మాత్రమే.
* సన్నిలియోన్ 42 అడల్ద్ సినిమాలకు దర్శకత్వం వహించింది.
* ఇండియన్ రియాలిటీ టీవీ షో బిగ్ బాస్ 5 కార్యక్రమంలో పాల్గొన్న అడల్ట్ స్టార్ కూడా సన్నిలియోన్ కావడం విశేషం.
* సన్నిలియోన్ కాలిఫోర్నియా మహిళా సాకర్ టీం తరపున ఆడింది.
* 19 సంవత్సరాల వయసు నుంచి అడల్ట్ మూవీస్ లో నటించడం మొదలు పెట్టింది.
* ముంబైలో 300 మంది విద్యార్ధులు ఉన్న ఓ స్కూల్ ను దత్తత తీసుకొని ఆ పాఠశాలకు కావలసిన సదుపాయాలను కల్పిస్తున్నది.
* క్రీడల పట్ల మక్కువతో సన్నిలియోన్ చెన్నై స్వాగర్ అనే క్రికెట్ జట్టును కొనుగోలు చేసింది.
* 2015లో ఇండియా అత్యధికమంది నెటిజన్లు సెర్చ్ చేసిన సెలబ్రిటీ సన్నికావడం విశేషం.