నేటిఏపి స్పెషల్ : వైకాపా మహిళా నేత రోజా గురించి కొన్ని సత్యాలు ఇవే..!

Friday, April 8th, 2016, 04:53:30 PM IST


రోజా.. ఇప్పుడు వైకాపాలో ఫైర్ బ్రాండ్ నేత. రోజా అసెంబ్లీ ఉన్నది అంటే చాలు.. ఆమె వాగ్దాటితో అందరిని ఆదరగోట్టేస్తుంది. రోజా మాట్లాడే విధానం చాలా కఠినంగా ఉంటుంది. ముక్కుసూటిగా పోయే వ్యక్తి. అందుకే.. ఆమె రాజకీయాలలో సైతం దూసుకొని పోగలుగుతున్నారు. మరి రోజా గురించిన కొన్ని సత్యాలను ఇప్పుడు తెలుసుకుందాం.

1. రోజా ఈ పేరుగురించి పెద్దగా పరిచయం అక్కరలేదు. సినిమా రంగంలో కొంతకాలం పాటు టాప్ హీరోయిన్ గా ఇండస్ట్రీని ఏలింది. పెద్ద స్టార్స్ అందరితో కలిసి నటించింది. సినిమాలలో రోజా గా మనకు కనిపించిన రోజా అసలు పేరు శ్రీ లతా రెడ్డి.

2. శ్రీ లతా రెడ్డి అలియాస్ రోజా సెప్టెంబర్ 17, 1972 వ సంవత్సరంలో చిత్తూరు జిల్లాలోని బకారపేటలో జన్మించారు.
3. రోజా శ్రీ పద్మావతి విశ్వవిద్యాలయం నుంచి పొలిటికల్ సైన్స్ లో పట్టాపుచ్చుకున్నారు. మొదటినుంచి రోజాకు రాజకీయాలంటే ఆసక్తి ఉన్నా, అనుకోకుండా సినిమాలలో అవకాశం రావడంతో అటువైపు వెళ్లారు.

4. రోజా కూచిపూడి నాట్యం నేర్చుకున్నారు. ఇదే సినిమాలలో రాణించడానికి ఆమెకు పనికొచ్చింది.

5. ఇక 1991 వ సంవత్సరంలో సర్పయాగం సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రోజా.. తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళ చిత్రాలలో నటించింది. నాలుగు భాషలలో రోజా అద్బుతంగా రాణించింది.

6. సినిమా కెరీర్ బాగున్నప్పుడే రోజా రాజకీయ రంగంలోకి అడుగుపెట్టింది. 1999 -2000 సంవత్సరంలో రోజా తెలుగుదేశం పార్టీలో అడుగుపెట్టిన రోజా పదేళ్ళపాటు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అయతే, 2009 లో రోజా తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం రోజా తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చి కొంతకాలం కాంగ్రెస్ లో ఉన్నారు.
7. వైఎస్ జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన తరువాత ఆమె వైకాపాలో చేరారు. 2014 ఎన్నికలలో వైకాపా తరపున నగరి నుంచి ఆమె పోటీ చేసి గెలుపొందారు.

8. ఇక ఎమ్మెల్యే గా అసెంబ్లీలో అడుగుపెట్టిన తరువాత రోజా తన వాగ్దాటితో అధికార పక్షాన్ని అనేక మార్లు ఇరుకున పెట్టె ప్రయత్నం చేశారు. అధికార పక్షాన్ని ఇరుకున పెట్టె ప్రయత్నం చేస్తున్నారని చెప్పి రోజాను సభ నుంచి సంవత్సరం పాటు సస్పెండ్ చేశారు.

9. ఇక అప్పుడప్పుడు సినిమాలో కనిపిస్తూ రాజకీయ రంగంలో బిజీ గా ఉండే రోజా..అటు బుల్లి తెరపై కూడా సంచలనం సృష్టిస్తున్నది. జబర్దస్త్ వంటి వినూత్నమైన కార్యక్రమాలకు జడ్జ్ గా వ్యవహరిస్తున్నది.