కళ్లెదుటే ప్రేయసిపై అత్యాచారం.. ప్రియుడి ఆత్మహత్య!

Friday, September 14th, 2018, 01:16:18 PM IST

కళ్ల ముందు ప్రేమించిన యువతిపై దుర్మార్గులు అఘాయిత్యానికి పాల్పడటంతో ఆ సంఘటనను ప్రేమికుడు తట్టుకోలేకపోయాడు. చివరికి బాధను భరించలేక ప్రాణాలు తీసుకున్నాడు. తీవ్ర కలకలం సృష్టించిన ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. అసలు వివరాల్లోకి వెళితే.. కటోఘోరా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఒక ప్రాంతంలో రెండు రోజుల క్రితం సాయి (21) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అయితే అతని ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకునేందుకు పలువురిని విచారణ జరిపారు.

అయితే అతను ఒక మైనర్ బాలికతో (17) ప్రేమలో ఉన్నట్లు తెలిసింది. కేసులో భాగంగా ఆమెను ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. బాలికపై సామూహిక అత్యచారం జరిగినట్లు తెలిసింది.
సెప్టెంబర్‌ 1న తాను సాయి సాయంత్రం ఓ పాఠశాల వద్ద కూర్చుని ఉండగా అప్పుడు అక్కడికి ఇద్దరు యువకులు ఈశ్వర్‌ దాస్‌(22), ఖేమ్‌ కన్వర్‌(21) వచ్చారని బాలిక తెలిపింది. అయితే వారిద్దరు సాయితో గొడవకు దిగి అతని ముందే తనపై అత్యచారం జరిపినట్లు పేర్కొంది. అనంతరం ఆ దుర్మర్గులు గ్రామంలో ఈ విషయాన్నీ పలువురికి తెలుపడంతో సాయి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని బాలిక వివరణ ఇచ్చింది. దీంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.