ప్రియుడికోసం భర్తపై హత్య కేసు.. ఢిల్లీలో కాపురం!

Friday, August 31st, 2018, 03:29:17 PM IST

దాంపత్య జీవితంలో మగవారు చేస్తున్న పొరపాట్లు అన్ని ఇన్ని కావు. అదే విధంగా ఇటీవల కొందరు మహిళలు కూడా భర్తల నుంచి విడిపోవాలని ఉహించని నిర్ణయాలు తీసుకున్నారు. రోజు రోజుకి ఆ సంఖ్య పెరుగుతోంది. రీసెంట్ గా ఓ మహిళ తన ప్రియుడికోసం భర్తపైన హత్య నేరం మోపిన ఘటన అందరిని షాక్ కి గురి చేసింది. అసలు వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ ఫిరోజాబాద్ డివిజన్ లోని బారాబంకీ ప్రాంతానికి చెందిన రూబీ అనే మహిళ హత్యకు గురైనట్లు ఆమె తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. 2016లో రూబిని పెళ్లి చేసుకున్న రాహుల్ కట్నం కోసం తన కూతురిని హత్య చేశాడని భార్య తండ్రి హరిప్రసాద్ కొన్ని నెలల క్రితం పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశాడు.

అయితే ఆయన చెప్పిన విషయాలకు ఎలాంటి అధరాలు పోలీసులకు లభించలేదు. దీంతో కేసును పోలీసులు పట్టించుకోవడం మానేశారు. ఈ క్రమంలో హరి స్థానికంగా ఉన్న కోర్టును ఆశ్రయించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ మొదలుపెట్టారు. అయితే ఎంత ప్రయత్నించినప్పటికీ భార్య శవం దొరక్కపోవడంతో కేసును డిఫెరెంట్ గా విచారించడం మొదలుపెట్టారు. రూబీ ఫెస్ బుక్, అలాగే ఫోన్ నెంబర్ పై నిఘా వేశారు. దీంతో వెంటనే పోలీసులకు ఆమె ఆచూకీ లభించింది. తన ప్రియుడితో కలిసి సంతోషంగా కాపురం చేస్తున్నట్లు పోలీసులు కనుగొన్నారు. అనంతరం న్యాయస్థానం కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. రాహుల్ పై కేసును కొట్టి వేస్తూ కోర్టును తప్పుదోవ పట్టించేలా వ్యవహరించిన నిందితులపై కేసు నమోదు చేశారు.