పెళ్లి కావడం లేదంటే ఈ మాంత్రికుడు ఏం చేసాడో తెలుసా..?

Tuesday, April 10th, 2018, 03:27:59 AM IST

తనకు పెళ్లి కావడం లేదు.. తరుచూ అనారోగ్యానికి గురవుతున్నాను. ఎవరైనా చేతబడి చేశారా? అని ఓ మాంత్రికుడిని బాధిత వ్యక్తి అడిగాడు. మరి ఆ మాంత్రికుడు.. బాధితుడికి ఇచ్చిన సలహా ఏంటో తెలిస్తే షాక్ అవుతారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అజయ్ ద్వివేది(42) గత కొంతకాలం నుంచి అనారోగ్యం బారిన పడుతున్నాడు. పెళ్లి కూడా కావడం లేదు. దీంతో ఓ మాంత్రికుడిని సంప్రదించాడు. తాను చెప్పినట్లు వినాలని ద్వివేది వద్ద మాంత్రికుడు అంగీకారం తీసుకున్నాడు. తనను ఫాలో అయితే.. పెళ్లి అవుతుంది. అనారోగ్య సమస్యలకు దూరమైపోతాయని ద్వివేదిని మాంత్రికుడు నమ్మించాడు.

ఆ తర్వాత మొబైల్ ఫోన్లు, దాని బ్యాటరీలు, పదునైన తీగలు, గ్లాసులతో పాటు మరికొన్ని వస్తువులను తినాలని ద్వివేదికి మాంత్రికుడు సూచించాడు. మాంత్రికుడిని నమ్మిన ద్వివేది.. పై వస్తువులన్నీ క్రమంగా తినేశాడు. దీంతో బాధితుడికి కడుపు నొప్పి ఎక్కువై పోయింది. బాధితుడు ద్వివేది డాక్టర్లను సంప్రదించాడు. ద్వివేదికి ఎక్స్‌రే తీయగా పదుల సంఖ్యలో ఇనుప ముక్కలు కనిపించాయి. ఆ తర్వాత బాధితుడికి ఆపరేషన్ చేసి కడుపులో ఉన్న ఇనుప ముక్కలను తొలగించారు. మాంత్రికులను నమ్మి మోసపోవద్దని.. శాస్త్రీయంగా ఆలోచించాలని వైద్యులు.. ద్వివేదికి చెప్పారు.