ట్రంప్ మరో షాకిచ్చాడుగా.. హెచ్‌-1బీ కొత్త రూల్!

Saturday, July 14th, 2018, 09:45:41 PM IST

అమెరికా కొత్త అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వీసా విషయాలలో ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో ఎవరికీ అర్ధం కావడం లేదు. సరికొత్త ఆలోచనలతో ఓ వైపు అక్కడి వారిని ఆకట్టుకుంటూనే మరోవైపు విదేశీయులకు వెన్నులో భయాన్ని కలిగిస్తున్నాడు. అధ్యక్ష పదవికి ముందు ఎలక్షన్స్ ప్రచారంలో ట్రంప్ చెప్పిన కఠిన నిర్ణయాలను మరచిపోకుండా అమలు పరుస్తున్నాడు. దీంతో ప్రస్తుతం అక్కడ విదేశీయులు ఆందోళన చెందుతున్నారు. గత కొంత కాలంగా హెచ్-1బీ వీసా విధానంలో మార్పులు ఎక్కువగా చేస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ట్రంప్ ప్రభుత్వం ఇటీవల హెచ్ -1బీ వీసా విధానంలో కొత్త తరహా రూల్ ని ప్రవేశపెట్టారు. దీంతో ప్రవాసులు తీవ్ర ఇబ్బందులు తలెత్తనున్నాయి. హెచ్‌-1బీ వీసాల గడువు ముగిస్తే ఆ దేశంలో వెంటనే అప్లై చెయ్యాలి. గడువు ముగిసిన 245 రోజుల వరకే అక్కడ ఉండే అవకాశం ఉంటుంది. అప్పటిలోపు దరఖాస్తు వీసా జారీ కాకుంటే దేశంలో ఉండకూడదు. ఒకవేళ అలా ఉంటే దేశ బహిష్కరణకు గాని పునరాగమనంపై నిషేధం విధిస్తారు. అలా ఉంటే కఠినచర్యలు తీసుకోవడానికి ట్రంప్ ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. వెంటనే యూఎస్‌ సిటిజన్‌షిప్ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీస్‌(యూఎస్‌సీఐఎస్‌) ‘నోటీస్‌ టు అప్పియర్‌(ఎన్‌టీఏ) జారీ చేస్తుంది. అప్పుడు అధికారులు విచారణ కోసం కొన్ని రోజులు ఉండాల్సి ఉంటుంది.

ఈ రూల్ కారణంగా చాలా మంది టెకీలకు ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పవచ్చు. వీసాలు రిజెక్ట్ అయితే మరింత కష్టకాలం ఉంటుందని చెప్పవచ్చు. హెచ్‌-1బీ వీసాపై చాలా మంది భారతీయులు అమెరికాలో ఉంటున్నారు. దాదాపు 7 లక్షల మందికి పైగా ఇండియన్స్ అమెరికాలో హెచ్‌-1బీ వీసాపై జాబ్ చేస్తున్నారు. వారు గడువు పెంచుకోవడానికి స్టేటస్ చేంజ్ చేసుకోవడంలో దరఖాస్తు రిజెక్ట్ అయితే వెంటనే భారత్ కు వచ్చేయాలి. వీళ్లకి అధికారులు ఎన్‌టీఏ నోటీసులు జారీ చేయరు.