ఎలాంటి విజయ్ మాల్యా ఎలా అయిపోయాడు…!

Thursday, April 4th, 2019, 01:20:10 PM IST

ఒకప్పటి “కింగ్ అఫ్ గుడ్ టైమ్స్” విజయ్ మాల్యా ఇప్పుడు దీన స్థితిలో ఉన్నాడు, నిత్యం విలాసవంతంగా జీవించిన ఆయన ఇప్పుడు భార్య, పిల్లల సంపాదన మీద ఆధారపడి బతికే స్థితికి వచ్చాడు. లండన్ తెలిపిన వివరాల మేరకు విజయ్ మాల్యా భార్య పింకీ లల్వాని ఏడాదికి గాను 1.35 కోట్లు అదనంగా సంపాదిస్తుండగా, విజయ్ మాల్యా ఆస్తుల్లో మిగిలిన 2,956కోట్ల రూపాయలు మొత్తాన్ని కర్ణాటక హైకోర్టులో సెటిల్ మెంట్ కోసం పెట్టాడు. 13భారతీయ బ్యాంకులకు ఇచ్చిన వివరణలో తాను భార్య, పిల్లల సంపాదనపై ఆధారపడినట్లు తెలిపాడు మాల్యా. తన పర్సనల్ అసిస్టెంట్ కు కూడా సుమారు రెండు కోట్ల రూపాయలు బాకీ పడ్డట్టు తెలిపాడు విజయ్ మాల్యా. అంతే కాకుండా బ్యాంకులకు ఎగ్గొట్టిన 11వేల కోట్లతో పాటు లాయర్ల ఫీజులు, బ్యాంకులకు చెల్లించాల్సిన ఇతర చార్జీలు మొత్తం కలిపి 6కోట్ల రూపాయల పైగా బకాయిలు ఉన్నాయని బ్యాంకుల తరఫున ప్రతినిధిగా ఉన్న నిగెల్ టోజి తెలిపాడు.

ఇదిలా ఉండగా విజయ్ మాల్యా ఏ మాత్రం ఇబ్బంది పడటం లేదని, మునుపటిలాగే విలాసవంతంగా జీవిస్తున్నడని టోజి అంటున్నాడు. మాల్యా వారానికి 18వేల పౌండ్లు ఖర్చు చేస్తున్నారని, బ్యాంకులకు సంబందించిన అప్లికేషన్ చార్జీలు 26లక్షల మేర ఉండగా వాటికోసం మాల్యా సుమారు 63లక్షల వరకు ఖర్చు చేసాడని అంటున్నారు. ఈ క్రమంలో ఐసీఐసీఐ బ్యాంకు కి సంబందించిన కేసులో వచ్చే వారంలో తీర్పు వెల్లడి కానుందని సమాచారం. ఏదేమైనా విజయ్ మాల్యా కేసు ఇప్పుడప్పుడే ఓ కొలిక్కి వచ్చేలా లేదు.