వైరల్ న్యూస్ : కేఎఫ్ సి లో మర్డర్

Tuesday, April 10th, 2018, 11:40:29 PM IST

బెంగళూరు నగరంలోని హెబ్బగుడి పోలీస్ స్టేషన్ పరిధిలో వున్న ప్రముఖ రెస్టారెంట్ కేఎఫ్ సి లో నిన్న జరిగిన ఒక మర్డర్ ఆ ప్రాంతవాసులు తీవ్ర భయబ్రాంతులకు గురిచేసింది. విషయంలోకి వెళితే, ఒరిస్సాకు చెందిన సమీర్ హెబ్బా గుడి ప్రాంతంలోని కేఎఫ్ సి లో వెయిటర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. అయితే ఎప్పటిలాగే రెస్టారెంట్ లో నిన్న తన విధుల్లో తాను ఉండగా, వున్నట్లుండి నలుగురు అజ్ఞాత వ్యక్తులు రెస్టారెంట్ లోకి ప్రవేశించి కౌంటర్ లో వున్న నగదు, అలానే అక్కడ వున్న మొబైల్ ఫోన్ లు లూఠీ చేసేందుకు ప్రయత్నించారు. అది గమనించిన సమీర్ వారిని అడ్డగించే ప్రయత్నం చేసాడు.

అయితే ఆ సమయంలో జరిగిన పెనుగులాటలో దుండగులు సమీర్ను అతి కిరాతకంగా కత్తులతో పొడిచారు. ఆ దెబ్బతో అక్కడికక్కడే కుప్పకూలాడు సమీర్. వెంటనే అక్కడి నగదు, మొబైల్ ఫోన్లతో ఆ నలుగురు ఉడాయించారు. తీవ్రగాయాలపాలయిన సమీర్ను అక్కడివారు ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మృతిచెందాడని హెబ్బగుడి పోలీస్ లు తెలిపారు. అయితే నిత్యం వందలమంది సంచరించే బెంగళూరు-హోసూర్ రహదారి ప్రాంతంలో జరిగిన ఈ హత్య తీవ్ర కలలం రేపుతోంది. కాగా కేఎఫ్ సి లోను, ఆ చుట్టుప్రక్కలప్రాంతాల్లో ఏర్పాటుచేసిన సిసి టీవి ఫుటేజి ని పోలీస్ లు పరిశీలిస్తున్నారు……